బిజినెస్

బంగారం, వెండిపై తగ్గిన దిగుమతుల టారిఫ్ విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: కేంద్ర ప్రభుత్వం సోమవారం బంగారం, వెండిపై దిగుమతుల టారిఫ్ విలువను తగ్గించింది. 10 గ్రాముల బంగారంపై 344 డాలర్లుగా, కిలో వెండిపై 461 డాలర్లుగా ఈ దిగుమతి టారిఫ్ విలువను నిర్ణయించింది. ఇంతకుముందు 10 గ్రాముల బంగారంపై 354 డాలర్లుగా, కిలో వెండిపై 470 డాలర్లుగా ఈ దిగుమతి టారిఫ్ విలువ ఉండేది. కాగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్ సూచనల ఆధారంగా ఈ మార్పులు జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఓ అధికారి పేర్కొన్నారు. భారత్‌లోకి విదేశాల నుంచి అత్యధికంగా దిగుమతి అవుతున్నవాటిలో ముడి చమురు తర్వాత, బంగారమే ఉంది. దిగుమతులు పెరిగినాకొద్ది అది కరెంట్ ఖాతా లోటుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.