తెలంగాణ

ఫిరాయింపులపై బాబు నోరువిప్పాలి: తలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాను చేస్తే నీతి, ఎదుటివారు చేస్తే అవినీతి అన్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను టిడిపికి రాజీనామా చేసి తెరాసలో చేరినపుడు చంద్రబాబు నీచంగా మాట్లాడారని, ఇపుడు వైకాపా ఎమ్మెల్యేలను ఏ విలువలతో పార్టీలో చేర్చుకుంటున్నారో నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడాలంటే- ఫిరాయింపులకు పాల్పడే వారిచేత పదవులకు రాజీనామాలు చేయించాలని ఆయన అన్నారు.