అంతర్జాతీయం

టాటా ‘రియో’ - హలో టోక్యో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్షం రోజుల పాటు యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తి అనంతమైన క్రీడానందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని అందించిన రియో ఒలింపిక్స్‌కు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత తెరపడింది. ఆరంభం ఎంత ఆర్భాటంగా, అట్టహాసంగా జరిగిందో..ముగింపూ అంతే కనువిందుగా ఆనందదాయకంగా ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు ముగింపు ఉత్సవాలు దేదీప్య వెలుగుల మధ్య జరిగాయి. 2020లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే టోక్యో ఈ మెగా ఈవెంట్ నిర్వాహణ బాధ్యతలను స్వీకరించింది. రెండు వందలకుపైగా దేశాలు..పదకొండు వేలకుపైగా అథ్లెట్లు.. ఇరవైకిపైగా క్రీడా వేదికలు..ఆరంభం నుంచి చివరి వరకూ ఎన్నో మలుపులు తిరిగిన ఒలింపిక్స్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తికావడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.