తెలంగాణ

మైనర్‌తో పెళ్లి కుదిర్చారని... అగ్నిమాపక కానిస్టేబుల్ బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ముషీరాబాద్, జూలై 29: అసలే ఇష్టం లేని పెళ్లి..అదీ ఓ మైనర్ బాలికతో.. మనస్తాపానికి గురైన అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన తీవ్ర కలకలం రేకెత్తించింది. మెదక్ జిల్లా సదాశివపేట్ మండలం తుంగడపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి (29) నగరంలోని గౌలిగూడ అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శివారెడ్డి కుటుంబసభ్యులు గత మార్చి నెలలో దూరపు బంధువైన మైనర్ బాలికతో నిశ్చితార్ధం కుదిర్చారు. ఇష్టం లేని పెళ్లి కుదిర్చారని అప్పటి నుండీ తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజులుగా డ్యూటీకి కూడా వెళ్లటం లేదు. గురువారం రాత్రి రూమ్‌మేట్ బాలకృష్ణ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన బాలకృష్ణ ఎంత తలుపు కొట్టినా తీయకపోవటంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవుడై కన్పించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి దగ్గర సూసైడ్ నోట్ లభించింది. తన బావ నాగిరెడ్డి, అక్క మంజుల, ఆర్‌ఎంపి డాక్టర్ హనుమంతారెడ్డి, అగ్నిమాపకశాఖలో ఉన్నతాధికారి రాజ్‌కుమార్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ముషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ధర్మపురిలో గోదావరి
అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు

ధర్మపురి, జూలై 29: ధర్మపురి క్షేత్రంలో జూలై 31వతేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకు నిర్వహించనున్న గోదావరి అంత్య పుష్కరాల కోసం ఎట్టకేలకు ఏర్పాట్లను ప్రారంభించారు. ఇటీవల జరిగిన పుష్కరాల సమీక్షా సమావేశాలలో భక్తుల సౌకర్యార్థం చేయాల్సిన ఏర్పాట్ల గురించి విస్తృత స్థాయిలో చర్చించిన క్రమంలో వాటి అమలుపై నిధుల లేమితో తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో ముందుగా దేవస్థానం, పంచాయతి పక్షాన అత్యవసర సౌకర్యాల కల్పన కోసం నడుం బిగించారు. రాజ, గాలి గోపురాలకు, దేవాలయాలకు విద్యుద్దీపాలను అమర్చారు. టిటిడి ధర్మశాలలో ఉచిత భోజనాలు ఏర్పాట్లు, గోదావరి సమీపాన నూతన నిర్మిత ఘాట్ల వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడానికి ఉపక్రమించారు.
ఆర్‌డబ్ల్యుఎస్ పక్షాన క్షేత్రంలో అన్ని బోరుబావులను పనిచేసేలా చూస్తూ, వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను, భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడానికి చర్యలు గైకొనాలని నిర్ణయించారు. ప్రతిరోజు ప్రత్యేక తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బంది నియామకాల ద్వారా అపరిశుభ్రతను దూరం చేసే చర్యలను పంచాయతి చేపట్టాలని, ప్రత్యేక పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, నదివద్ద అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సేవలను ఉపయోగించుకోవాలని, విద్యుత్ సరఫరా అవాంతరాలను అధిగమించాలని నిర్ణయించారు.