విజయనగరం

పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం , డిసెంబర్ 8: పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించాలని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో పన్ను వసూళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆస్తిపన్ను చెల్లింపుదారులందరికీ డిమాండ్ నోటీసులను జారీ చేయాలని చెప్పారు. మొదటి అర్థ సంవత్సరంలో పన్నుల వసూళ్లు మందగించినందున, రెండవ అర్థ సంవత్సరంలో పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. మార్చి నెలాఖరు నాటికీ శతశాతం పన్నుల వసూలు జరిగేటట్లు చూడాలని, దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో 12.40 కోట్ల రూపాయల పన్నుల వసూళ్లు జరగవలసి ఉండగా, ఇంతవరకు నాలుగు కోట్ల రూపాయల మేరకు పన్నుల వసూళ్లు జరిగిందని అన్నారు. అందువల్ల పన్నుల వసూళ్లను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పట్టణంలో 46,772 అసెస్‌మెంట్లు ఉన్నాయని చెబుతూ మున్సిపాలిటీలో విలీనమైన శివారు ప్రాంతాలలో కొత్త భవనాలకు పన్నులు వేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ రెవెన్యూ అధికారి డేవిడ్, మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సాయి ప్రసాద్, వినోద్‌కుమార్, శంకరరావు, రమేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక నిలయం .. ఆలయాల సముదాయం
గజపతినగరం, డిసెంబర్ 8: గజపతినగరం గ్రామం మధ్యలో గల ఆలయాల సముదాయం ఆధ్యాత్మిక నిలయం. ఆలయాల ప్రాంగణంలో అతి పురాతన ఆలయంలతో సహా ఇటీవల నిర్మించిన పలు ఆలయాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్త్తున్నాయి. ప్రాంగణంలో ఉత్తర దిశలో ఉమారామలింగేశ్వర ఆలయం, దక్షిణ దిశలో సీతారామస్వామి ఆలయంలు పురాతనమైనవి. ఎప్పుడు ఎవరి పాలనలో ఎవరు నిర్మించారో ఖచ్చితంగా ఆధారాలు లేవు. ఇదే ప్రాంగణం పురాతన ఆలయాల మధ్యలో ఖాళీ స్థలంలో కన్యకా పరమేశ్వరి, సత్యసాయి మందిరం, కల్క్భిగవాన్, సుభ్రహ్మణ్యస్వామి నవగ్రహ ఆలయాలకు ప్రత్యేక పర్వదినాల్లో దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. సీతారామ స్వామి దేవస్థానం పరిధిలో గల ఆలయాలకు ఆధాయాన్ని ఇచ్చే ఆస్తులు పుష్కలంగా ఉన్నాయి. గజపతినగరం గ్రామంలో ఇళ్లు, షాపులు కలవు. అలాగే పాత శ్రీరంగరాజ పురం, ములకల గుమ్మడాం గ్రామాల్లో భూములు కలవు. షాపులు, ఇళ్లు, అద్దెలు భూమి శిస్తుల ద్వారా ప్రతి ఏడాది లక్షలాది రూపాయలు ఆదాయం లభిస్తున్నది. ఆలయ ప్రాంగణంలో గల పురాతన ఆలయాలకు తూర్పు దిశలో గల ప్రవేశ ద్వారంలు కూలిపోవడానికి సిద్దంగా ఉన్నాయి. ప్రభుత్వం సమకూర్చిన (సిజి ఎఫ్) కామన్‌గుడ్ ఫండ్ నిధులతో పురాతన ఆలయాలు అభివృద్ది పరిచారు. ప్రవేశ ద్వారాలు శిథిలమై పోయి కూలడానికి సిద్దంగా ఉన్నా పట్టించుకోలేదు. ఇటీవల ఆలయానికి ఎదురుగా గల శిలాఫలకాలు కూలిపోయి పడిపోవడంతో క్యూలో నిలుచున్న భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఐదేళ్ల కిందట జరిగింది. ఇటువంటి ప్రమాదాలు జరగకముందే ప్రవేశ ద్వారాలు పునర్ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. కార్తీక మాసం మహాశివరాత్రి , ధనుర్మాసం వంటి పర్వదినాల్లోను అలాగే శనిత్రయోదశి నాడు అధిక సంఖ్యలో వస్తున్న భక్తులు స్నానాలు చేసి దుస్తులు మార్చుకోవడానికి సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాంగణంలో గల పిచ్చిమొక్కలు ఇసుకను తొలగించాలని కోరుతున్నారు. ఆదాయం పుష్కలంగా ఉన్న దూపదీప నైవేద్యాలకు మరింత ఆర్థిక సహాయం అందజేయాల్సిన అవసరం ఉంది. చాలాకాలం ప్రైవేటు యాజమాన్యం పర్యవేక్షణలో గల దేవస్థానాన్ని 1980లో దేవాదాయ, ధర్మాధాయ శాఖ పరిధిలో చేరింది. ఇప్పటికైనా ఆలయాలు మరింత అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పైడితల్లి అమ్మవారికి విశేషపూజలు
విజయనగరం, డిసెంబర్ 8: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారికి మంగళవారం విశేష పూజలు జరిపారు.ఖర్బూజా పండ్లతో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామున సుప్రభాత సేవ, అనంతరం ప్రత్యేక కుంకుమ పూజలు, అభిషేక అర్చనలు జరిపారు. మంగళవారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పలువురు మహిళలు చీర, రవికెలను అమ్మవారికి చూపి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు పూజాదికాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజా పర్యవేక్షణ జరిపారు.

ఉత్సాహంగా క్రిస్మస్ వేడుకలు
విజయనగరం ,డిసెంబర్ 8: పట్టణంలోని కోట సమీపంలో ఉన్న యునైటెడ్ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో మంగళవారం ఉత్సాహంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.క్రీస్తు జన్మించిన పశువుల శాలను, నక్షత్రాన్ని ఏర్పాటు చేసారు. బ్రిడ్జ్ ఆఫ్ హోప్ సంస్ధ వ్యవస్ధాపకుడు బెంజ్‌మెన్ మాట్లాడుతూ అకాడమీలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అకాడమీ డైరక్టర్ అర్జున్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా అకాడమీలో రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి వేడుకలను విద్యార్ధులచే నిర్వహింపచేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు.

అధిక దిగుబడులు సాధించేలా రైతులను చైతన్యపరచాలి
విజయనగరం, డిసెంబర్ 8: తక్కువ ఖర్చులతో అధిక దిగుబడులు సాధించేలా రైతులను చైతన్యపరచే కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాథమిక రంగం సెక్టార్‌లో వ్యవసాయ అభివృద్ధ్ది రెండంకల రేటుకు చేరుకునేలా అధికారులు కృషిచేయాలని కోరారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో వ్యవసాయం, పశుసంవర్థకం, మత్స్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దశలవారీగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్‌కార్డులు అందజేయాలని, దీనివల్ల ఆయా పంటభూముల్లో ఏ పంటలు వేయాలి, ఎరువులు ఏ సమయంలో ఎంత మోతాదులో వేయాలి అనే అంశాలపై అవగాహన ఏర్పడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఎదజల్లడం వలన కలిగే లాభాలు, సేంద్రీయ ఎరువుల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సేంద్రీయ ఎరువులు ఉపయోగించి అధిక దిగుబడులు సాధించిన రైతులతో మిగతా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పశుసంవర్థక శాఖ ద్వారా మేతగడ్డి సాగుచేయడం ద్వారా పాల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టాలని, దీనికోసం తక్కువ సమయంలో కోతకు వచ్చే హైడ్రోఫోనిక్స్ గడ్డిని పెంచడంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. డెయిరీ, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో చేపల పెంపకానికి అనువుగా ఉన్న చెరువులను గుర్తించి వాటిలో చేపల పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ, పశుసంవర్థక శాఖల జాయింట్ డైరెక్టర్లు లీలావతి, సింహాచలం, మత్య్సశాఖ అసిస్టెంట్ డెరెక్టర్ ఫణిప్రకాశ్, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్ తదితరుల పాల్గొన్నారు.