జాతీయ వార్తలు

టాక్సీ బుక్ చేసుకోవడానికి పాక్ నంబరు వాడిన ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని తమ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రతిస్తూనే ఉన్నారని, అంతేకాండా ఆ దేశపు మొబైల్ నంబరును ఉపయోగించి పఠాన్‌కోట్‌లో తమకోసం ఒక టాక్సీని సైతం ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. టెర్రరిస్టులు శుక్రవారం ఒక టయోటా ఇన్నోవాను ఉపయోగించారని, పాకిస్తాన్ నంబర్‌నుంచి వారు ఆ వాహనం డ్రైవర్‌కు ఫోన్ చేసారని గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
భద్రతా ఏజన్సీలు ఆ డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారని, ఉగ్రవాదులతో సంబంధాలున్న పాక్ స్మగ్లర్లకు రెగ్యులర్‌గా సేవలు అందిస్తున్నాడా లేక అది పాక్ నంబరని తెలియకుండానే అతను వారికోసం టాక్సీ తీసుకెళ్లాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఇన్నోవా కారు డ్రైవర్‌ను పఠాన్‌కోట్ సమీపంలోని ఒక నిర్దేశిత ప్రాంతానికి రమ్మని చెప్పారని, అక్కడ టెర్రరిస్టులు ఆ వాహనం ఎక్కారని తెలుస్తోంది. తారు లేని కచ్చారోడ్డులో ప్రయాణించడానికి టెర్రరిస్టులు ఇన్నోవా కారును ఉపయోగించారని, అయితే కొంతసేపు తర్వాత వాహనం రిమ్ దెబ్బతినడంతో దాన్ని వదిలేశారని ఆ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత టెర్రరిస్టులు పంజాబ్ పోలీసుకు చెందిన సూపరింటెండెంట్ ప్రయాణిస్తున్న మహింద్ర ఎస్‌యువి జడ్ 500 వాహనాన్ని హైజాక్ చేసి దానిలో ప్రయాణించారని ఆ వర్గాలు తెలిపాయి.