కృష్ణ

పాతబస్తీ వాసులకు తప్పని నీటి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 9: ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పుణ్యమని పాతబస్తీ వాసులకు నీటికష్టాలు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈనిర్మాణ పనులు చేస్తున్న ఒక కంపెనీ సిబ్బంది కింద ఉన్న నీటిపైపులను గమనించకుండా పనులు చేయటంతో తరుచుగా భూగర్భంలో ఉన్న నీటిపైపులు పగలిపోవటంతో పాతబస్తీ వాసులకు మంచినీళ్లు బంద్ కావటంతో వీరి కష్టాలు అన్ని ఇన్నికావు. ఉదయానే్న వెళ్లి వివిధ రకాలైన కూలీపనులు చేసుకొని ఇళ్లకు వచ్చేసరికి తాగేందుకు గుక్కెడునీళ్లు లేక విలవిలలాడుతున్నారు. నెలలో రెండుసార్లు మంచినీళ్ల గొట్టాలు విరిగిపోయిన కారణంగా పాతబస్తీవాసులు మంచినీళ్లు కోసం టాంక్‌లు వద్దకు వచ్చి నీళ్లు పట్టుకోవాలని సూచన అంటూ నగరపాలక సంస్థ అధికారులు చెప్పటం పరిపాటిగా మారిపోయింది. దీంతో మంచినీళ్ల గొట్టాలు ఎప్పుడు పగిలిపోతాయే అనే భయాందోళన మధ్య పాతబస్తీ నివాసితులు నలిగిపోతున్నారు. పొరపాటున ఇంటికి బంధువులు వచ్చిన సమయంలోనే మంచినీళ్ళ గొట్టాలు పగిలిపోవటం ఒకశాపంగా మారిపోయింది. కొద్దిరోజుల క్రితం సుమారు నాలుగు రోజులు పాటు గొట్టాలు పగిలిపోయి పాతబస్తీలో వివిధ డివిజన్‌లకు మంచినీళ్ల సరఫరా నిల్చిపోయిన సందర్భంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బందితో మంచినీళ్లు గొట్టాలు తొలుత గుర్తించి తర్వాత వాటిని ఇబ్బందికి రాకుండా పనులు చేయాలని ఆదేశించారు. తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బంది ఈసమయంలో కమిషనర్ చెప్పిన దానికి సరే అంటూ చెప్పి తర్వాత వారి పంథాలో పనులు చేయటంతో శుక్రవారం మ ధ్యాహ్నం ఒక గొట్టం పగిలిపోవటంతో 25వ డివిజన్‌లో నీళ్లు బంద్ అయి 30గంటలు గడిచిపోయింది. శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ సిబ్బంది వచ్చి ట్యాంకులు సెంటర్‌ల్లో పెట్టాం నీళ్లు పట్టుకొండి అంటూ నివాసితులకు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రత్యేకంగా ఈడివిజన్‌లో అధిక శాతం పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే నివాసితులు. దీంతో ఈడివిజన్ ప్రజలు వేకు వ జామునే వివిధ కూలీ పనులకు వెళ్లి అర్ధరాత్రి పూట ఇళ్లకు చేరుకుంటారు. ట్యాంకుల ద్వారా కేవలం ఇళ్లల్లో ఉండే వారు మాత్రమే నీళ్లు పట్టుకునే అవకాశం ఉంది. పనులకు వెళ్లిన వారికి ఏ విధంగా అవకాశం లేకపోవటంతో అర్ధరాత్రి నీళ్ల కోసం బిందెలు పట్టుకొని పరుగులు తీయాల్సిన పరిస్థితు లు నెలకున్నాయి. ఇప్పటికైనా ఫ్లైఒవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బంది నీళ్లు గొట్టాలు గమనించి పనులు చేస్తే బాగుంటుందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదేవిధంగా ముందుగానే నగరపాలక సంస్థ సిబ్బంది మంచినీళ్ల గొట్టాల లైనులను నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బందికి చూపించటంతో ఈపనుల సమయంలో సాధ్యమైన వరకు వారు కూడా మేరకు ఉంటే అన్నివిధాలు బాగుంటుందని స్థానిక నివాసితులు విజ్ఞప్తి చేశారు.