రంగారెడ్డి

టిడిపి ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 11: టిడిపి శాసనసభాపక్షం టిఆర్‌ఎస్‌లో విలీనం రాజ్యాంగ విరుద్ధమని టిడిపి జిల్లా నాయకులు గాండ్ల ఉమాశేఖర్, కె.రంగరాజ్‌లు అన్నారు. శుక్రవారం స్థానిక అర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు చీకటిరోజని చెప్పారు. గవర్నర్, సిఎం, స్పీకర్ ప్రమాణస్వీకారం చేసేటపుడు రాజ్యాంగంపై రాజ్యాంగ విలువలను కాపాడుతామని, శాసనసభ వ్యవహారాలను పరిరక్షిస్తామని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని ప్రమాణం చేశారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం అప్రజాస్వామికంగా టిడిపి శాసనసభ్యులు టిఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు ప్రకటించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో ప్రజాసమస్యలపై ప్రస్తావనలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడగానే తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీని మరచారని అన్నారు. కెజి టు పిజి ఉచిత విద్య, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కలగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని అన్నారు. దళితుడిని సిఎం చేస్తామని చెప్పిన కేసిఆర్ మాట తప్పారని, లక్ష ఉద్యోగాలు ప్రకటనకే పరిమితమైందని ధ్వజమెత్తారు. నల్గొండలో ఉద్యమకారుడి ఆత్మహత్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి బసిరెడ్డి, పట్టణ ప్రచార కార్యదర్శి ఆలూర్ రమణ, టిఎన్‌ఎస్‌ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, హుండెకారి సత్యనారాయణ, సైకిల్ కృష్ణ, దళిత యువ నాయకుడు నాగారం వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
అప్రజాస్వామికం
మోమిన్‌పేట: టిడిపికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయించడం అప్రజాస్వామికమని మోమిన్‌పేట్ మండల టిడిపి అధ్యక్షుడు సిరాజుద్దీన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను పార్టీలోకి చేర్చుకోవడం మానివేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కేసిఆర్‌కు హితువు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఒగ్గు మల్లయ్య, శ్రీనివాస్, శివకుమార్, శేఖర్, జావిద్, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.