జాతీయ వార్తలు

ఆంధ్రకు అన్యాయం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర బడ్జెట్‌పై టిడిపి అసంతృప్తి
న్యూఢిల్లీ, మార్చి 14: ఎన్‌డిఏ ప్రభుత్వం 2016-17 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అన్యాయం చేసిందని టిడిపి సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రామ్మోహన్ నాయుడు లోక్‌సభ టేబుల్‌పై పెట్టిన తన ప్రసంగం ప్రతిలో మొత్తంమీద బడ్జెట్ బాగున్నా తమ రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నిధులు, పథకాల కేటాయింపు జరగలేదంటూ తన బాధను వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి కేటాయింపుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్లు కేటాయించటాన్ని ఆయన గట్టిగా సమర్థించారు.
సెక్టార్ల వారీగా సర్వే జరిపించాలి
నైపుణ్య అవసరాలపై సెక్టార్లు, దేశాల వారీగా సర్వే జరిపించాలని టిడిపి సభ్యుడు గల్లా జయదేవ్ లోక్‌సభ జీరో అవర్‌లో సూచించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం గురించి మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ పొందిన వారు చాలామందికి ఉపాధి లభించటం లేదన్నారు. సరైన పద్ధతిలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు సెక్టార్ల వారీగా, దేశాల వారీగా సర్వేలు జరిపించి, దాని ప్రకారం నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకాభివృద్ధికి 12వ పంచవర్ష ప్రణాళికలో రూ. 250 కోట్లు కేటాయించి ఇంతవరకు 64 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యాటకాభివృద్ధి మంత్రి శర్మ టిడిపి సభ్యుడు అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని 31 పర్యాటక ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.