రుచి

గ్రీన్ టీతో పంటి నొప్పికి చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం నిద్రలేవంగానే టీ తాగటం ఓ అంతర్భాగమైపోయింది. టీ తాగితే ఉత్సాహం వచ్చేస్తుందని అనుకుంటాం. కొంతమంది కాలక్షేపానికి టీ తాగుతారు. ఉద్యోగస్తులు పని ఒత్తిడిని దూరం చేసుకోవటానికి టీ చక్కగా ఉపకరిస్తుందని కనీసం రోజుకు నాలుగైదుసార్లు టీ తాగకుండా ఉండేలేరు. ఈ అలవాటును ఏలాగు మానుకోలేం. కాబట్టి పంచదార కలిపిన టీ కాకుండా గ్రీన్ టీని అలవాటు చేసుకోమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు మూడుసార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టీవల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలున్నాయని అంటున్నారు. గ్రీన్ టీ తాగటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపోడుకోవచ్చు. గ్రీన్ టీలో రకరకాల వనమూలికలు కలిపి ఉంటాయి. దీనిని సేవించడం వల్ల శరీరంలో ఉన్న ఎన్నో రుగ్మతలు దూరవౌతాయంటున్నారు వైద్యులు. మొక్కల ఆకులు, వేళ్లు, పళ్లు, పూవులు, కాయలు ఇతర చెట్టు భాగాలు హెర్బల్ టీ తయారీలో ఉపయోగిస్తారు. దీంతో దీనిని సేవించటం వల్ల హృదయం పదిలంగా ఉంటుంది. గుండెపోటును నిరోధిస్తుంది. జీర్ణక్రియలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఇది శరీరంలో ఉన్న మలినాలను విసర్జించేలా చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే టీలో పంచదార కలుపుకోవటం వల్ల పళ్లకు హాని కలుగుతుంది. గ్రీన్ టీ సేవించటం వల్ల జ్ఞాన దంతాలతో పాటు ఇరవై దంతాలు సురక్షితంగా ఉన్నాయని న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రతి రోజూ గ్రీన్ టీ సేవిస్తుంటే జీవితంలో పంటి వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరమే ఏర్పడదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. దంతాలు పాడవుకండా పంటి నొప్పులకు చెక్ పెట్టవచ్చని వీరు అంటున్నారు.