అక్షర

ఉపాధ్యాయుల కరదీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవీయ
ఉపాధ్యాయుడు.
డా.శివార్చక
విజయకుమార్,
పేజీలు: 232,
వెల: రూ.225/-
ప్రతులకు: రచయిత ఎం.ఐ.జి.హెచ్.2
169, హౌజింగ్
బోర్డుకాలనీ, ఎదిర,
మహబూబ్‌నగర్.

ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చదువవేస్తాడు. కొంత కాలానికి, ‘ఎలా చదివావు?’అన్న తండ్రి ప్రశ్నకు ‘‘చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ!’’ అని జవాబిస్తాడు.
చదవటం వేరు. చదువులలోని సారాన్ని గ్రహించటం వేరు. నేటి విద్యార్థులు చదువుకొంటున్నారు. కాని చదువుల్లోని సారాన్ని ఒంటపట్టించుకోవటం లేదు.
ఇది గమనించిన డా.శివార్చక విజయకుమార్ తాను చదివిన పుస్తకాల సారాన్ని, ఉపాధ్యాయ మిత్రుల సాహచర్యలో పొందిన అనుభవాలను మేళవించి, మార్పుకు శ్రీకారం చుడుతుందన్న చిరుఆశతో ‘‘మానవీయ ఉపాధ్యాయుడు’’అన్న ఈ పుస్తకాన్ని మనముందుకు తెచ్చినట్లుగా ‘నామాట’లో చెప్పుకున్నారు.
వీరు ఉపన్యాసకులు, ప్రిన్సిపాల్, ఆచార్యులు, జిల్లా విద్యాశాఖాధికారి సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి. తాను పనిచేస్తున్న విద్యాశాఖను లోతుగా అధ్యయనంచేసి వ్రాసినది ఈ పుస్తకం.
ఇందులో ఆరు అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయం విద్య అంటే ఏమిటో వివరిస్తుంది. 2నుండి 6 అధ్యాయాలు, విద్యగరపటంలో ఉపాధ్యాయుడు ఎలా మెలగాలో వివరిస్తాయి.
ఒకచోట రచయిత ఇలా అంటాడు. ‘‘్ఫల్‌గుడ్- ఫీల్ ఫౌడ్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్’’. అవును. ఏ రంగానికైనా ఆ రంగం ఔన్నత్యాన్ని గుర్తించి, ఆ రంగం సమాజానికి మరింత సేవ చేయగలిగేట్లుగా ప్రయత్నించటం ఒక గొప్ప ళ్యశఆజఇఖఆజ్యశ. జ్ఞానాన్నిచ్చి సంస్కారం నేర్పి, మనిషిగా, మహనీయుడిగా మలిచేవాడు ఉపాధ్యాయుడు (పే.217) అని చెబుతూ, ‘పిల్లలు, ఉపాధ్యాయులు, యాజమాన్యం- వీరంతా, ఒకే త్రాటిపై నడిచి జట్టు భావన’తో పనిచేయాలని చెబుతారు (పే.217) రచయిత.
సమస్యను బాగా అర్థంచేసుకుని, వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనంచేసి ఏం చేయాలో, ఎలాచేయాలో సిద్ధాంతీకరింప బడింది ఇందులో.
ఎక్కడా ‘‘మొనాటనస్’’గా ఉండకుండా, ఆసక్తికరంగా సరళమైన భాషలో, ఎందరో మహానుభావుల (ఉదా.సోక్రటీసు, ప్లాటో. మేరియా మాంటిస్సోరి, రవీంద్రనాథ టాగోర్) కొటేషన్స్‌తో వివరించబడింది ఈ పుస్తకం.
63 నుండి 75 వరకు- పేజీల్లో వివరించిన గణాంకాలు విజయకుమార్ గారికి విద్యాశాఖ పట్ల గల నిబద్ధత, లోతైన దృష్టిని తెలియచేస్తుంది.
ప్రభుత్వం మరియు విద్యగరిపే ప్రయివేటు సంస్థలు ఈ పుస్తకాన్ని ఉపాధ్యాయుల మధ్య ఉంచి విస్తృతమైన చర్చలు జరిపి విద్యారంగంలో ఉపాధ్యాయుల పాత్రపై అవగాహన కల్పించటం ఎంతో అవసరం.
1986లో ప్రకటించిన నూతన జాతీయ విధానం ప్రకారం ‘‘ఉపాధ్యాయుడిని మించిన సమాజం ఉండదు’’ అన్న నినాదానికి వివరణ ఈ పుస్తకం.

-కూర చిదంబరం