క్రీడాభూమి

నాగపూర్ చేరిన టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, మార్చి 13: కోల్‌కతాలో శనివారం దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్ ఆడిన భారత క్రికెట్ జట్టు ఆదివారం నాగపూర్ చేరుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర సభ్యులకు ఇక్కడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమ కోసం ఎదురుచూస్తున్న విలేఖరులతో మాట్లాడకుండా టీమిండియా సభ్యులు హోటల్‌కు వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం వామప్‌లో పాల్గొన్నారు. సోమవారం నెట్స్‌కు హాజరవుతారు. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా తమ మొదటి మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఈనెల 15న ఆడతారు. అయితే, 19న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌పైనే భారత్ దృష్టి కేంద్రీకృతమైంది. వరుస విజయాలతో ఊపుమీద ఉన్న టీమిండియాకు శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వామప్ మ్యాచ్ షాకిచ్చింది. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయడం భారత బౌలింగ్ విభాగంలో తలెత్తుతున్న సమస్యలను మరోసారి తెరపైకి తెచ్చింది. వామప్ మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన నష్టం లేకపోయినా, బౌలర్ల ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. హర్దిక్ పాండ్య 36 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి, జట్టులో తన అవసరాన్ని మరోసారి గుర్తుచేశాడు.
చాలాకాలంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న మహమ్మద్ షమీ 37 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు కూల్చినప్పటికీ, 51 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రపంచ మేటి జట్ల బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి తగినంత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకపోవడం బుమ్రా ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తున్నది. హర్భజన్ సింగ్, పవన్ నేగీ, రవీంద్ర జడేజా, సురేష్ రైనా బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లో భారత్ పటిష్టంగా ఉంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకూ ప్రయత్నించినప్పటికీ లక్ష్య సాధనలో తడబడింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేయగలిగింది. ఫలితంతో సంబంధం లేకుండా ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించడంతో, భారత క్రికెటర్లు భారీ షాట్లకు ప్రయత్నించలేదు. కాగా, వామప్ మ్యాచ్‌ని చేజార్చుకున్నప్పటికీ, కివీస్‌తో జరిగే తమ మొదటి సూపర్-10 మ్యాచ్‌లో విజయభేరి మోగించి శుభారంభం చేసేందుకు టీమిండియా సిద్ధమవుతున్నది. ఆతర్వాత పాకిస్తాన్ పని పట్టాల న్నది టీమిండియా ఆశయం.
(చిత్రం) నాగపూర్ విమానాశ్రయంలో భారత కెప్టెన్ ధోనీ (ఎడమ), అతని సహచరులు సురేష్ రైనా, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా