తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎంసెట్-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎంట్రన్స్ నిర్వహణకు తెలంగాణలో 95, ఎపిలో 28 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. తెలంగాణలో 38,245 మంది, ఎపిలో 17,943 మంది విద్యార్థులు ఎంసెట్-2కి దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం పదిగంటలకు పరీక్ష ప్రారంభించి, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని లోనికి ఎక్కడా అనుమతించలేదు. పరీక్షకు సంబంధించి ప్రాథమిక ‘కీ’ని ఈరోజు సాయంత్రం, ఫలితాలను ఈనెల 14న విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.