రాష్ట్రీయం

రైతుల ఆత్మహత్యలపై కలెక్టర్లు విచారణ చేసి నివేదిక ఇస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 10: ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రైతుల ఉదంతాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు, రైతాంగ కమిషన్ ఏర్పాటుకు మరింత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ఎస్ శరత్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. గురువారం హైకోర్టులో రైతుల ఆత్మహత్యలపై ప్రొఫెసర్ కోదండరామ్, వ్యవసాయ జన చైతన్య సమితి ప్రతినిధి పాకాల శ్రీహరిరావు దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది శరత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో పిటిషనర్లు కోరినట్లుగా ఆత్మహత్యల ఉదంతాలపై విచారణ జరిపేందుకు మూడు వారాల గడువు కావాలని కోరారు. రైతాంగ సంక్షేమానికి, రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు పిటిషనర్లు పిల్‌లో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేశారు.