రాష్ట్రీయం

‘సాంకేతిక సామర్ధ్యం పెరిగితే భద్రత పెరుగుతుంది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: సాంకేతిక సామర్ధ్యం ఎంత పెరిగితే రైల్వేలో అంత భద్రత ఉంటుందని రైల్వే బోర్డు టెలికం విభాగం అదనపు సభ్యుడు కె.ఎస్.కృష్ణకుమార్ అన్నారు. రైల్వేలో సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థలో వచ్చే సాంకేతిక మార్పుల వల్ల భద్రత ప్రమాణాలు పెరుగుతున్నాయని అన్నారు. వౌలాలిలోని రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ శిక్షణ కేంద్రం (ఎస్‌టిటిసి) 11వ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. శిక్షణ పొందుతున్న సాంకేతిక సిబ్బంది, అధికారులు తమ నైపుణ్యాన్ని పెంచుకుని పని చేయాలని కోరారు. వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్న ఎస్‌టిటిసిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే చీఫ్ సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీర్ ఎంఎస్ మహబూబ్‌ఆలీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. చీఫ్ సిగ్నల్ ఇంజినీర్ డి.వెంకటాచలం అధ్యక్షత వహించారు. శిక్షణలో నైపుణ్యం సాధించిన 39 మందికి మెడల్స్, సర్ట్ఫికెట్లను ప్రధానం చేశారు.