రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ రాజభవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ పౌరులు తమ హక్కుల కోసం పోరాడాలని అదే సందర్భంలో పౌరుడిగా తమ బాధ్యతలను గుర్తెరగాలని అన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి వుండాలని ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రమాణం చేయించారు.

రాజ్యాంగం గురించి యువత తెలుసుకోవాలి..

మన రాజ్యాంగం గురించి యువత సంపూర్ణంగా తెలుసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. ఆమె రాజ్‌భవన్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని గవర్నర్ ప్రమాణం చేయించారు. రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్న గవర్నర్‌కు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.