తెలంగాణ

ఐటీఐఆర్‌పై అసెంబ్లీలో రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీఐఆర్‌పై అధికార-ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్-ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలనే యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్‌ను మంజూరు చేసిందని, ఎందుకు ఆ ప్రాజెక్టును సాధించలేదని నిలదీశారు. ఐటీఐఆర్ ద్వారా మొత్తం 70 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. అసెంబ్లీలో ఐటీఐఆర్ కోసం తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. భట్టి వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ఐటీఐఆర్ విధానాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. యూపీఏ ప్రభుత్వం 2013లో బెంగుళూరు, హైదరాబాద్‌లో ఐటీఐఆర్ అనుమతి ఇచ్చిందని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఐటీఐఆర్‌‌ కోసం కాంగ్రెసోళ్లేదో ఉద్ధరించినట్లు...తామేదో నాశనం చేసినట్టు మాట్లాడం సరికాదని హితవు పలికారు.