రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన కార్తీక దీపోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : పవిత్ర కార్తీకమాసం ముగింపు సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు పుణ్యనదుల్లో కార్తీక దీపాలు వదిలారు. శనివారం వేకువజాము నుంచే భక్తులు పవిత్ర కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, స్వర్ణముఖి నదుల్లో పుణ్యస్నానాలాచరించి కార్తీక దీపాలు వదిలారు. కృష్ణాజిల్లా విజయవాడలోని దుర్గా ఘాట్‌ వద్ద పుణ్యస్నానాలాచరించారు. ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పూజల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరిలో విశేష సంఖ్యలో వచ్చిన భక్తులు గోదావరిలో కార్తీక దీపాలను సమర్పించారు. ఈ సందర్భంగా తులసీమాతను ఆరాధించి అష్టోత్తరాలు పఠించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో గోదావరి నదీపాయల్లో పోలు దీపాలు వదిలారు. వైనతేయ, వశిష్ట గోదావరి నదీ పాయాల్లో అధికసంఖ్యలో మహిళలు దీపాలను వదిలారు.