హైదరాబాద్

తెలుగువారి పరిరక్షణకే ‘తెలుగు సేన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలుగు భాషను, తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడు కోవాలని తెలుగు వారై పుట్టినందుకు తెలుగు జాతి గర్వించే విధంగా తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ చక్రపాణి పిలుపునిచ్చారు. తెలుగుసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం తెలుగు లలిత కళాతోరణంలో జరిగిన తెలుగు గర్జన కార్యక్రమానికి చక్రపాణి ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో పిల్లల్ని చేర్పిస్తూ పిల్లలు తెలుగు మర్చిపోయేలా చేస్తున్నారని, తెలుగు పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీయం స్కూళ్లుగా మారిపోతున్నాయని అన్నారు. తెలుగుజాతిని ప్రేమిద్దాం, తెలుగు ఔన్నత్యాన్ని చాటుకుందామని చక్రపాణి పేర్కొన్నారు. మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారి గొప్పతనం పంచకట్టులోను, గోంగూర పచ్చడితో గుటకలు వేయడంలో ఉందని చెప్పారు. ఆంధ్రాలో తెలుగువారి రాజధాని అమరావతిలో ఇంగ్లీష్‌లో బోర్డు రాయడం దురదృష్టకరమని, విజయవాడలో ఇంగ్లీష్ బ్యానర్‌లు కనపడడం మన భాషను మనమే కించపరచుకోవడమని అన్నారు. తొలుత సంస్థ జాతీయ అధ్యక్షుడు పి.సత్యారెడ్డి మాట్లాడుతూ మార్చిలో జరిగే పరీక్షలు తెలుగులోనే రాయాలని, ఈ విషయంలో ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తామని అన్నారు. కార్యక్రమంలో రచయిత జనార్దన్‌రెడ్డి, తెలుగు సేవా మహిళా అధ్యక్షురాలు కుర్రా భవాని, తెలుగుసేన యువత అధ్యక్షుడు కృష్ణ పాల్గొన్నారు.