రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే తమ ఇంటి ముందు భోగి మంటలు వేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పోలీస్‌ గ్రౌండ్‌లో యువకులు భోగి మంటలు వేసుకుని పండుగ జరుపుకున్నారు. ముమ్మడివరం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మురుమళ్ల గ్రామంలో ఎమ్మెల్యే దాట్లసుబ్బరాజు కోడిపందేలను ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో భోగభాగ్యాల భోగి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలో, రాజమండ్రిలో, విశాఖలో, హైదరాబాద్ నగరంలో ప్రతి ఏరియాలో భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. నగర ప్రజలు భోగి పండుగను భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకున్నారు. కేబీఆర్ పార్క్ లో జరిగిన భోగి మంటల వేడుకలో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. విజయవాడ శివారులోని గొల్లపూడి ఎన్టీఆర్‌ కూడలి వద్ద జరిగిన భోగి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.