మీకు తెలుసా ?

హోదాను తెలిపే దువ్వెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 5 వేల సంవత్సరాల క్రితమే దువ్వెన వాడకం మొదలైంది. 160 ఎ.డి. నాటి దువ్వెన ఇప్పటికీ భద్రంగా ఉంది. రాతియుగంలో కూడా దువ్వెనలను విస్తృతంగా వాడారు. రాయి, ఎముకలు, ఏనుగు దంతాలు, విలువైన లోహాలు, చివరకు గాజుతోకూడా అప్పట్లోనే దువ్వెనలు తయారు చేశారు. ఇప్పుడు ప్లాస్టిక్, ఫైబర్, సిలికాతో కూడా దువ్వెనలు వస్తున్నాయి. పాతరోజుల్లో వెండి, బంగారు, వజ్రాలు, నవరత్నాలు పొదిగిన దువ్వెనలు వాడేవారు. సంపన్నులు ఖరీదైన, విలువైన దువ్వెనలు వాడటం హోదాగా భావించేవారు. తలను, కురులను శుభ్రం చేసేందుకు దువ్వెనలు వాడటం మామూలేకదా. కానీ కొందరు కేవలం సంగీత వాయిద్యంగా కూడా దువ్వెనలను వాడటం విశేషం.

- ఎస్.కె.కె. రవళి