జాతీయ వార్తలు

ఆలయాల్లోకి మహిళలను అనుమతించాలి: ఆర్‌ఎస్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగౌర్, మార్చి 13: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మహిళల విషయంలో తన గత వైఖరిని మార్చుకుంది. దేశవ్యాప్తంగా గల అన్ని దేవాలయాలలోకి మహిళలు ప్రవేశించడానికి అనుమతివ్వాలన్న డిమాండ్‌కు మద్దతిచ్చింది. అయితే ఈ అంశాన్ని వీధి పోరాటాలతో కాకుండా ఇరు పక్షాలు సామరస్యపూర్వక చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇటీవల జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ దేశంలోని అన్ని దేవాలయాలలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని చేసిన ప్రతిపాదనను ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి మద్దతిచ్చారు. కొన్ని దేవాలయాలలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించకపోవడం సరికాదని, ఎలాంటి వివక్ష లేకుండా అన్ని దేవాలయాలలోకి స్ర్తిపురుషుల ప్రవేశాన్ని అనుమతించాలని ఆయన పిలుపునిచ్చారు.