జాతీయ వార్తలు

చొచ్చుకొచ్చిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లడఖ్‌లో 6కిలోమీటర్లు దూసుకొచ్చిన పిఎల్‌ఎ
ప్రతిఘటించిన ఐటిబిపి దళాలు
గంటల పాటు సంఘర్షణ పరిస్థితి
న్యూఢిల్లీ/ లే, మార్చి 11: కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలోకి చైనా దళాలు మరోసారి చొచ్చుకొచ్చాయి. ప్రకృతి శోభితమైన పాంగోంగ్ సరస్సు సమీపంలోని భారత భూభాగంలోకి దాదాపు ఆరు కిలోమీటర్ల మేర చైనా సైనిక దళాలు ఈ నెల 8న చొచ్చుకు వచ్చాయని, ఆ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య సంఘర్షం వాతావరణం ఏర్పడినట్టు తెలుస్తోంది. కల్నల్ హోదా కలిగిన ఓ అధికారి నేతృత్వంలో మొత్తం 11మంది చైనా పిఎల్‌ఎ దళాలు ఊహాజనిత వాస్తవాధీన రేఖను దాటి వచ్చాయని భద్రతా వర్గాలు తెలిపాయి. భారత్‌కు చెందిన థాకుంగ్ సరిహద్దు పోస్టు నుంచి మొత్తం నాలుగు వాహనాల్లో చైనా సైనికులు వచ్చినట్టుగా తెలిపాయి. దాదాపు ఐదున్నర కిలోమీటర్ల మేర చైనా దళాలు భారత్‌లోకి రావడాన్ని గుర్తించిన ఇండోటిబెటన్ గస్తీ దళాలు వారిని ప్రతిఘటించాయి. దానితో దాదాపు కొన్ని గంటల పాటు ఇరుదళాల మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయని..అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో చైనా దళాలు వెనుదిరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. తరచు చైనా దళాలు భారత భూభాగంలోకి చొచ్చుకురావడానికి కారణం..సరిహద్దుల విషయంలో స్పష్టమైన నిర్థారణ లేకపోవడమేనని చెబుతున్నారు. అయితే ఈ తాజా ఘటనకు సంబంధించి అధికారికంగా ఎలాంటి వివరణ లేనప్పటికీ 11మంది చైనా సైనికుల్లో ఇద్దరు మేజర్ ర్యాంకు అధికారులు కూడా ఉ న్నట్టు చెబుతున్నారు. చైనా దళాల వద్ద భారీగానే ఆయుధాలు ఉన్నాయని, వాటికి దగ్గ స్థాయిలోనే ఇండోటిబెటన్ దళాల వద్ద కూడా ఆయుధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 90 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పంగాంగ్ నది తీర ప్రాంతం పొడవునా నిత్యం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు కారణం మూడింట రెండొంతుల ఈ భాగం చైనా ఆధీనంలో ఉండటమే.2013లో ఇదే ప్రాంతంలో ఇరు దేశాల దళాలు మధ్య సంఘర్షణ పరిస్థితులు తలెత్తాయి.