క్రీడాభూమి

కోట్లా టెస్టుపై భారత్ పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 190 పరుగులు చేసిన టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 334 పరుగులకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా 121 పరుగులకే ఆలౌట్‌కాగా, రెండో రోజు ఆటను అక్కడే ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, దక్షిణాఫ్రికాకు ఫాలోఆన్ ఇవ్వరాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయించడంతో, మూడోరోజైన శనివారం ఉదయం భారత్ రెండో ఇన్నింగ్స్‌ను మురళీ విజయ్, శిఖర్ ధావన్ ఆరంభించారు. అయితే, కేవలం నాలుగు పరుగుల స్కోరువద్ద విజయ్ (3) వికెట్ కూలింది. 15 బంతులు ఎదుర్కొన్న అతను మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డేన్ విలాస్‌కు దొరికిపోయాడు. రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్ కూడా మోర్కెల్‌కే లభించింది. 86 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 21 పరుగులు చేసిన ధావన్‌ను సైతం మోర్కెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చటేశ్వర్ పుజారా 28 పరుగులు చేసి ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 57 పరుగులకు నాలుగు వికెట్లు చేజార్చుకున్న టీమిండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆజింక్య రహానే అండగా నిలిచారు. ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 133 పరుగులు జోడించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లకు 190 పరుగులు సాధించగా, కోహ్లీ 83 (154 బంతులు, 10 ఫోర్లు), రహానే 52 (152 బంతులు, 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. మోర్కెల్ 29 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని భారత్ ఇప్పటి వరకూ 403 పరుగులు ముందంజలో ఉంది. మరో ఆరు వికెట్లు చేతిలో ఉంచుకొని పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తున్నది. ** రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్ధ శతకం సాధించిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆజింక్య రహానే

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 117.5 ఓవర్లలో 334 ఆలౌట్ (విరాట్ కోహ్లీ 44, ఆజింక్య రహానే 127, రవిచంద్రన్ అశ్విన్ 56, కేల్ అబోట్ 5/40, డేన్ పిడిట్ 4/117).
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 49.3 ఓవర్లలో 121 ఆలౌట్ (ఎబి డివిలియర్స్ 42, టెంబా బవుమా 22, రవీంద్ర జడేజా 5/30, ఉమేష్ యాదవ్ 2/32, అశ్విన్ 2/26).
భారత్ రెండో ఇన్నింగ్స్: మురళీ విజయ్ బి విలాస్ బి మోర్కెల్ 2, శిఖర్ ధావన్ బి మోర్కెల్ 21, రోహిత్ శర్మ బి మోర్కెల్ 0, చటేశ్వర్ పుజారా బి ఇమ్రాన్ తాహిర్ 28, విరాట్ కోహ్లీ 83 నాటౌట్, ఆజింక్య రహానే 52 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (81 ఓవర్లలో 4 వికెట్లకు) 190.
వికెట్ల పతనం: 1-4, 2-8, 3-53, 4-57.
బౌలింగ్: మోర్న్ మోర్కెల్ 17-6-29-3, కేల్ అబోట్ 17-6-38-0, డేన్ పిడిట్ 18-1-53-0, ఇమ్రాన్ తాహిర్ 21-4-49-1, డీన్ ఎల్గార్ 8-1-19-0.