అంతర్జాతీయం

బ్రెగ్జిట్ ముగిసింది.. ఇక టెగ్జిట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి ‘బ్రెగ్జిట్’ పేరిట బ్రిటన్ వాసులు మొగ్గు చూపడంతో ఇపుడు అమెరికాలోనూ వేర్పాటువాదాలు తెరపైకి వస్తున్నాయి. అమెరికా నుంచి టెక్సాస్ రాష్ట్రం విడిపోవాలన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ‘టెగ్జిట్’ పేరిట వేర్పాటువాద ఉద్యమం ఊపిరి పోసుకుంటోంది. బ్రెగ్జిట్ ఫలితాలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించగా ఇపుడు టెక్సాస్‌లో సరికొత్త చర్చ మొదలైంది. అమెరికాలో టెక్సాస్ ఉండాలా? వద్దా? అనే విషయమై రిఫరెండమ్ నిర్వహించాలని కొందరు వాదిస్తున్నారు. అమెరికాలో రెండో అతిపెద్ద రాష్టమ్రైన టెక్సాస్ ఒకప్పుడు మెక్సికోలో ఉండేది. మెక్సికో నుంచి విడిపోయాక 1836 నుంచి 1845 వరకూ స్వతంత్ర దేశంగా ఉన్న టెక్సాస్ 1845లో అమెరికాలో 28వ రాష్ట్రంగా విలీనమైంది. బ్రెగ్జిట్ ఫలితాల సందర్భంగా ట్విట్టర్‌లో ఎంతోమంది టెక్సాస్ వాసులు స్పందించారు. ఈ నేపథ్యంలోనే టెగ్జిట్ జరపాలన్న వాదన తెరపైకి వచ్చింది.