జాతీయ వార్తలు

అన్న.. అందర్నీ హతమార్చాడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థానె: మహారాష్టల్రోని థానెలో ఒకే కుటుంబానికి చెందిన 14 మందిని హతమార్చిన ఘటనలో తీవ్ర గాయాలతో బతికి బయటపడిన మహిళ సుబియా ఈరోజు అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. స్పృహ వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ, తన అన్న అన్వర్ అందరినీ చంపేశాడని, తనపై దాడి చేయగా గదిలోకి వెళ్ల గడియ పెట్టుకున్నానని తెలిపింది. ఉన్మాదిగా మారిన అన్వర్ తన తల్లిదండ్రులను, భార్యాపిల్లలను, కుటుంబ సభ్యులను, చిన్నపిల్లలను దారుణంగా కడతేర్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ముందు తమ మధ్య ఆస్తులకు సంబంధించి ఘర్షణ జరగలేదని సుబియా చెబుతోంది. 14 మంది మరణించిన విషయాన్ని ఆమెకు వైద్యులు ఇంకా తెలియనివ్వలేదు. ఆమె పూర్తిగా కోలుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.