పశ్చిమగోదావరి

విచిత్ర దొంగ.. వింత అలవాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయస్సు 30:19సార్లు జైళ్ల సందర్శన:అరెస్టుచేసిన పోలీసులు
ఏలూరు, డిసెంబర్ 27 : చిన్నతనం నుంచి చోరకళలో ఆరితేరిన ఒక విచిత్ర దొంగను ఏలూరు పోలీసులు అరెస్టుచేశారు. చిన్న పిల్లల జైలు దగ్గర నుంచి అన్ని రకాల జైళ్లకు దాదాపు 19 సార్లు వెళ్లివచ్చేశాడు. ఇప్పుడు మరోసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఏది ఏమైనా ఈ ప్రబుద్ధుడు మాత్రం దొంగతనం చేసినందుకు ఏ మాత్రం చింతించకపోగా చివరకు అది తప్పెలా అవుతుందంటూ ఎదురు ప్రశ్న కూడా వేయగలడు. అంతేకాకుండా ఫలానా దొంగతనం చేశావా అంటే మా భేషుగ్గా చేశానని అక్కడ పలానావి దొంగిలించానని కూడా తేదీలతో సహా చెప్పగల మంచి జ్ఞాపక శక్తి కూడా ఇతని సొంతం. ఏది ఏమైనా ఇతని దొంగతనం మాత్రం పద్దతి ప్రకారం ఇంటిలోవారికి అలికిడి కూడా తెలియకుండా జరిగిపోతుంది. తెల్లారితే గానీ అసలు దొంగతనం జరిగిందనే బాధితులు గుర్తించరు. ఏ జిల్లా వెళ్లినా, ఏ ఊరు వెళ్లినా మనవాడు ఎక్కడా భోజనం చేయడు. ఎల్లప్పుడూ స్వయంపాకంపైనే ఆధారపడతాడు. దీనికోసం ఎంతైనా ఖర్చుపెడతాడు. ఇక వివరాల్లోకి వెళితే స్థానిక ఏలూరు సబ్ డివిజన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఏలూరు డిఎస్‌పి కెజివి సరిత ఈ వివరాలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న కస్తూరి అప్పన్న అనే 30 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన 30 కాసుల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను చిన్నతనం నుంచి దొంగతనాలకు అలవాటుపడిపోయాడు. పిల్లల జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలుతో సహా అన్ని జైళ్లలోనూ 19 సార్లు శిక్షలు అనుభవించాడు. దాదాపుగా 70 వరకు దొంగతనాల కేసుల్లో ఇతను నిందితుడు. పలు జిల్లాల పరిధిలో ఈ దొంగతనాలను విస్తరిస్తూ వచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో ఉంగుటూరు గ్రామంలోని కాళ్ల అచ్యుతరావుకు చెందిన భవనంలో రాత్రి సమయంలో మడత మంచం ఊచతో కిటికీ ద్వారా తలుపు లోపలి గెడ తొలగించి లోనికి ప్రవేశించి బీరువాలో వున్న చంద్రహారం నెక్లెస్ సెట్, గాజుల జత, నాలుగు ఉంగరాలు, బ్రాస్‌లెట్, చెవి దుద్దులు, మాటీలు, చెంప సవరాలు, రెంగు గొలుసులు, నల్లపూసల గొలుసు, వెండి పట్టీలు మొత్తం ముప్పైన్నర కాసుల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అదే విధంగా ఏలూరు టుటౌన్ పరిధిలో పవర్‌పేటలో గత ఆగస్టు మొదటి వారంలో ఒక భవనంలో దొంగతనం చేసి బంగారపు హారం, గాజులు, నల్లపూసల దండ, చెవి జూకాలు, ఇతర వస్తువులను దొంగిలించాడు. ఇవన్నీ ఒక వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టాడు. ఈ విధంగా ఇతను దొంగతనాలు జిల్లా నుంచి జిల్లాకు పాకుతూ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు, రామచంద్రపురం, కాకినాడ, పందలపాక, తొస్సిపూడి, హైదరాబాద్‌లోని లింగంపల్లి, రంగారెడ్డిజిల్లా వికారాబాద్ తదితర ప్రాంతాల్లో దొంగతనాలతోపాటు మోటారు సైకిళ్ల దొంగతనాలు కూడా చేస్తూ వచ్చాడు. మొత్తం మీద ఇతన్ని తాడేపల్లిగూడెం మినీ బైపాస్ నుంచి తణుకు బైపాస్ రోడ్డుకు వెళ్లే మార్గంలో నిందితుడు కస్తూరి అప్పన్నను గణపవరం సిఐ ఎన్ దుర్గాప్రసాద్, నిడమర్రు ఎస్‌ఐ రవి, చేబ్రోలు ఎఎస్‌ఐ, సిబ్బంది అరెస్టు చేశారు. ఈ కేసును చేదించడంలో సమర్ధంగా వ్యవహరించిన గణపవరం సి ఐతో సహా మిగిలిన అధికారులు, సిబ్బందిని డి ఎస్‌పి అభినందించారు. వారికి రివార్డులు అందించనున్నట్లు తెలిపారు.