క్రీడాభూమి

మూడోటెస్టుకు అస్తశస్త్రాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

========
భారత్‌తో మూడో టెస్టు కోసం ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు. టి-20, వనే్డ సిరీస్‌లను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది. అయతే, భారత్‌తో మొహాలీతో జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైంది. రెండో టెస్టు వర్షం కారణంగా డ్రాకాగా, మూడో టెస్టును ఆ జట్టు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
=======
నాగపూర్, నవంబర్ 22: భారత్, దక్షిణాఫ్రి కా జట్లు ఈనెల 25 నుంచి మొదలుకానున్న మూడో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నా య. హషీం ఆమ్లా కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా ఇ ప్పటికే ఇక్కడికి చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టిం ది. టీమిండియా ఆదివారం సాయంత్రం చే రుకుంది. సోమవారం నుంచి ప్రాక్టీస్ సెషన్ కు హాజరుకానుంది. దక్షిణాఫ్రికాను ఫిట్నెస్ సమస్య వేధిస్తున్నది. భారత్‌కు ఆ సమస్య లే కపోయనా, తుది జట్టు కూర్పు కెప్టెన్‌కు తల నొప్పి వ్యవహారంగా మారనుంది. కాగా, మూడో టెస్టు మ్యాచ్‌కి భారీ మార్పులేవీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో టెస్టుకు టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు మరో ఐదుగురు, మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే, భారత్-ఎ కెప్టెన్ చటేశ్వర్ పుజారా సేవలు అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారు. వికెట్‌కీపర్‌గా సేవలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు ఫార్మెట్‌కు గుడ్‌బై చెప్పడంతో అతని స్థానాన్ని వృద్ధిమాన్ సాహా భర్తీ చేస్తున్నాడు. అయితే, అతను బ్యాట్స్‌మన్‌గా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ విభాగానికి వస్తే, భువనేశ్వర్ కుమార్, ఇశాంత్ శర్మ పేస్ అటాక్‌ను కొనసాగించడం ఖాయం. స్పిన్ బౌలింగ్‌ను అశ్విన్ నియంత్రీకరిస్తాడు. రవీంద్ర జడేజా మరో స్పిన్నర్‌గా సేవలు అందించే అవకాశాలున్నాయి. వర్షం కారణంగా నాలుగు రోజుల ఆట రద్దయిన నేపథ్యంలో డ్రాగా ముగిసిన రెండో టెస్టులో మొదటి రోజు ఆట మాత్రమే సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను టీమిండియా బౌలర్లు 214 పరుగులకే ఆలౌట్ చేశారు. అశ్విన్, జడేజా చెరి నాలుగు వికెట్లు పడగొట్టి సత్తాచాటారు. నాగపూర్ వికెట్‌పైనా బంతి నింపాదిగా కదులుతుందికాబట్టి అశ్విన్, జడేజా తుది జట్టులోకి చేరడంపై ఎలాంటి అనుమానాలు లేవు. వీరిద్దరూ జట్టులో ఉంటే, మూడో స్పిన్నర్ ఎవరన్న ప్రశ్న ఎదురవుతుంది. ముగ్గురు స్పిన్నర్లను తీసుకుంటాడా లేక స్టువర్ట్ బిన్నీ రూపంలో ఆల్‌రౌండర్ ఉండాలని కోహ్లీ కోరుకుంటాడా అన్నది ఇంకా తెలియడం లేదు. స్పిన్నర్ పట్ల అతను మొగ్గుచూపితే, అమిత్ మిశ్రా ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మిశ్రా కంటే బిన్నీకే కోహ్లీ ప్రాధాన్యం ఇస్తాడన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. టాప్ ఆర్డర్ విఫలమైన ప్రతిసారీ టీమిండియా బ్యాటింగ్ కుప్పకూలడం ఇటీవల ఆనవాయితీగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు జట్టులో ఆల్‌రౌండర్ల అవసరం ఉందని కోహ్లీ పదేపదే చెప్తున్నాడు. అమిత్ మిశ్రాతో పోలిస్తే బిన్నీకి బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ మార్కులు పడతాయి. అందుకే అతనివైపే భారత కెప్టెన్ మొగ్గుచూపడవచ్చు. బిన్నీ వైఫల్యాల బాటలో నడుస్తున్నప్పటికీ, అతనికి తగినన్ని అవకాశాలు ఇవ్వాలన్నది కోహ్లీ అభిప్రాయం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే, అమిత్ మిశ్రాకు తుది జట్టులో స్థానం అనుమానంగానే కనిపిస్తున్నది. అతను మరోసారి బెంచ్‌కి పరిమితం కావచ్చు.