నల్గొండ

కమలానికి గుచ్చుకున్న గులాబీ ముల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ఏకైక బిజెపి మున్సిపాల్టీకి ఎసరు * బిజెపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీలలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక చిచ్చు
భువనగిరి, డిసెంబర్ 6: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలోని ఏకైక బిజెపి చైర్మన్ సీటుకు ఎసరుపెట్టాయి. టిఆర్‌ఎస్ పార్టీ జిల్లాలో తమ అధిపత్యాన్ని నిరూపించుకునేందుకు జిల్లా మంత్రి కనుసన్నలలో పెద్ద ఎత్తున క్యాంపురాజకీయాలు నడుస్తున్నాయి. ఈఎన్నికలు మంత్రి జగధీశ్వర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించి పెద్ద ఎత్తున ఇతరపార్టీలనుండి టిఆర్‌ఎస్‌లోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా భువనగిరి మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బరిలోకి దించడంతో భువనగిరి ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిదులపై ముందస్తుగా టిఆర్‌ఎస్ పార్టీ గాలం వేసింది. జిల్లామంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిల సమక్షంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్‌తోసహా 14మంది కౌన్సిలర్లు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అందులో బిజెపికి చెందిన చైర్‌పర్సన్ సుర్విలావణ్యతో సహా కౌన్సిలర్ మాయ దశరథ, తెలుగుదేశం పార్టీకి చెందిన 6గురు బర్రె మహాలక్ష్మి, నాసిర్, జైబున్నీసా, ఆబోతుల కిరణ్, ఎనబోయిన లలిత, కడారి ఉమాదేవి, నాయకులు సుర్విశ్రీనివాస్‌గౌడ్, ఎనబోయిన జహాంగీర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు పాశం అమర్‌నాధ్, పోలిశెట్టి అనీల్‌కుమార్, బోగ వెంకటేశ్, ముగ్గురు స్వతంత్ర సభ్యులు లాయిఖ్‌అహ్మద్, ఫతె మహ్మద్, గోమారి సుధాకర్‌రెడ్డి, మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మున్సిపల్‌లో చోటు చేసుకున్న తాజాపరిణామాలు బిజిపితో సహా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు తీరనిఘాతంగా మారింది. ఈకార్యక్రమంలో భువనగిరికి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ అత్యవసర సమావేశం
భువనగిరి మున్సిపాలిటిలో చోటుచేసుకున్న పరిణామాలపై సమీక్షించేందుకు భారతీయ జనతాపార్టీ నాయకులు అత్యవసర సమావేశమయ్యారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశమై జరుగుతున్న పరిణామాలపై చర్చ వేడివేడిగా పరస్పర అరోపణలతో కొనసాగింది. సమావేశంలో రాష్ట్ర బిజెపి నాయకులు పివి శ్యాంసుందర్‌రావ్, పోతంశెట్టి రవీందర్, వేముల అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు నర్ల నర్సింగ్‌రావ్, పార్టీ పార్లమెంట్ కన్వినర్ పాశం బాస్కర్, అసెంబ్లి కన్వినర్ పడమటి జగన్మోహన్‌రెడ్డిలతోసహా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చైర్‌పర్సన్ సుర్వి లావణ్య ఇంటి వద్ద బిజెపి నిరసన
భారతీయ జనతా పార్టీ నుండి గెలిచి చైర్‌పర్సన్ పదవిని అలంకరించిన సుర్విలావణ్య తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంపట్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చైర్‌పర్సన్ లావణ్య ఇంటివద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసన కార్యక్రమం చేపట్టిన బిజెపి నాయకులను చెదరగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జరుగుతున్న పరిణామాలను దృష్ట్యా పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.