తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

చీరాలలో చిగురించిన ఆలోచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుల నిర్మూలన జరిగే క్రమంలోనే ప్రజలపై ఇతర
రాజకీయ పార్టీలు, ప్రాబల్యం తగ్గిపోతూ ఉంటుంది. కొత్త మనిషికి నిర్వచనం ఇస్తూ, అలాంటి మానవుడిని రూపొందించేందుకు ‘చీరాల అనుభవం’ పనికి వస్తుందని నాకు నేను ఆశ్వాసన ఇచ్చుకున్నాను.

ల్లందులో కటుకోఝ్వల రమేశ్ కవితా సంపుటి ‘అగ్నిశిఖ’ ఆవిష్కరణ సభలో పాల్గొని, గత ఆదివారం చీరాల పట్టణం, ఖమ్మం జిల్లా చేరాను. ‘దళిత బహుజన సంఘాల మేధోమథన సదస్సు’లో పాల్గొనాలని మిత్రులు ఆహ్వానించారు. మొదట తటపటాయించాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శక్తుల మధ్య సయోధ్య సాధ్యమా? గత ఐదారేళ్ళలో ఎన్ని చర్చలు? ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు? ..లెక్కలేదు. ఎవరు ఎందుకు ఈ అంశం మీద సభ పెడతారో, వారి ఆలోచన ఏమిటో స్పష్టం కాదు. సమయం, సందర్భం ఉన్నవి కొన్ని. వాటిని పరిగణించనివి మరికొన్ని. ఇలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ముగింపు లేని ముచ్చటగా కొనసాగుతున్న అంశం ఇది.
ఏదో ఒక మలుపుదగ్గర మాటేసి గెలుపు చేజిక్కించుకోవాలని ఆరాటపడే శక్తులు చాలానే ఉన్నాయి. అవకాశాలు చేజారాక ఆకులు పట్టుకున్న దాఖలాలే ఎక్కువ. రాష్ట్ర విభజన సందర్భంలో ఈ శక్తులు బలోపేతం కావలసి ఉండింది. పెట్టుబడిదారుల ఉద్యమంలో- రాళ్ళెత్తినవారు, రాళ్ళ దెబ్బలు తిన్నవారు, జైలుకెళ్ళినవారు, ప్రాణత్యాగాలు చేసిన ‘బహుజన శక్తులు’ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలలో తమ ప్రమేయాన్ని నిలుపుకోలేకపోయారు. వడివడిగా సాగిన పెత్తందారుల పథక రచనలో పక్కకు కొట్టుకుపోయి నాలుగేళ్ళు కావస్తున్న సందర్భంలో ఇలాంటి కొన్ని ప్రయత్నాలు!
తెలంగాణలో సీపీఎం తన సైద్ధాంతిక చట్రాన్ని సడలించి నీల్‌లాల్ ఐక్యతా ప్రయత్నాలు ప్రారంభించింది. ‘దళిత బహుజన ఫ్రంట్’ దిశగా పావులు కదిపింది. ఏపీలో అలాంటి ప్రయత్నాలు పెద్దగా చేపట్టడం జరగలేదు. ఆ పని ఎక్కడికక్కడ జిల్లాల వారీగా కొన్ని సంస్థలు చేయనారంభించాయి. మరికొందరు రెండు రాష్ట్రాలలో చిన్నచిన్న పార్టీల ఏర్పాటు ద్వారా ఎవరికివారే తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సదస్సు.
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. కోయిలలు తొందరపడడం లేదు గాని, స్వరాలు సవరించుకుంటున్నాయి. కోయిలలు ఒక శక్తిగా రూపొందడానికి అవకాశాలను బేరీజు వేసుకోవడం ఇప్పుడు తప్పుకాదు. యూపీలో ఎస్పీ, బీఎస్పీలు సాధించిన విజయాలు, పొందిన పరాభవాల లెక్క కళ్ళముందే ఉంది. ఓట్లు మావి.. సీట్లు మీవా? ఎంతమాత్రం చెల్లదన్న దశాబ్దం ఇది. నిజానికి ఈ ఆలోచన తొలిసారి మన దేశంలో బలంగా ఈమధ్యే మొదలైంది. రాబోయే కాలంలో రాజకీయాలు ఈ కేంద్రకం చుట్టే తిరుగుతాయి. శ్రామికజన రాజ్యం ఏర్పాటు సాధ్యం కానందునే ఈ ఆలోచన వచ్చింది. మిగతా పార్టీలన్నీ రాజ్యాధికారం కోసమే మాయమాటలు వల్లించి పబ్బం గడుపుకోవడం గ్రహించిన ప్రజాశక్తులు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వేసిన పునాది నుండి కాన్షీరాం అభివృద్ధి పరిచిన ఆలోచనా విధానం దేశ భవితవ్యానికి కొత్త ప్రణాళిక ఇచ్చింది. కాని అనతికాలంలోనే ఎన్నో ఒడిదొడుకులకు లోనైంది. మరోవైపు పకడ్బందీగా ఉన్న మార్క్సిజం, సిద్ధాంతపరంగా గొప్పదైనప్పటికీ ఆచరణలో దారుణంగా వెనకబడింది. బ్రాహ్మణీయ నేతల చేతల్లో అభాసుపాలైంది. అంతిమంగా శ్రామిక ప్రజల స్వప్నం శకలాలుగా పగుళ్ళు బారింది. విప్లవ గుడారాలలో మార్క్సిజం పరాభవింపబడింది. శ్రామిక నియంతృత్వం కోసం జరిగే పోరాటాలలో అగ్రవర్ణ వర్గ నాయకుల నియంతృత్వం, పెత్తందారీ పోకడలు ఎక్కువై అసలుకే మోసం అయ్యింది. పెత్తందారీ కుల స్వభావం ప్రజలను సమానంగా చూడలేకపోయింది. ప్రజలు అందుకు ఆగ్రహావేశాలతో ఉడికిపోయారు. మంచితనం కారణంగా వారు ఎదురుతిరగలేదు. కాని అంత పని జరిగింది. వామపక్షాలు, ప్రగతివాద నిర్మాణాలు గుణపాఠాలు నేర్చుకోవడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడింది. అం దుకే కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రయోగాలకు తెర తీశారు. ఇంకా తెరలు లే స్తున్నాయి. ఐతే ప్రజాశక్తులకి ‘ఐక్యత’ పెద్ద సమ స్య. అధికార రాజకీయాల వలలో పడి ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి. ఎస్టీల మధ్య, ఎస్సీల మధ్య రిజర్వేషన్ల చిచ్చు నానాటికీ పెరిగిపోతున్నది. శత్రుపూరిత వైఖరి హెచ్చింది. రాజకీయ, బ్రాహ్మణవాదాల మరో రూపం ఎన్జీవోయిజం, దళిత బహుజనుల మధ్య, బహుజన కులాల మధ్య ఐక్యతకు భంగం కలిగించే కుటిల యత్నాలను ముమ్మరం చేసింది. తెలంగాణలో ప్రభుత్వమే ఎన్జీవోగా ఒక అడుగు ముందుకేసి కులాల వారి విద్యావిధానాన్ని పెంచి పోషించడానికే నిర్ణయించింది. కుల భవనాలను నిర్మించాలని కోట్లు గుమ్మరిస్తున్నది. కుల సంఘాలను పార్టీల వారీగా విడగొడుతున్నారు. కుల చైతన్యం- విడిపోవడానికి పనికివచ్చే దినుసైంది. ఉద్యమకాలంలో ఐక్యంగా, కలసికట్టుగా పనిచేసిన తెలంగాణ విద్యార్థి, ఉద్యోగ సంఘాలను కులాల పేరిట విడగొట్టేశారు. సాహిత్య అకాడమీని ఏర్పాటుచేసి పైవర్గాల వారిని చైర్మన్‌గా,కార్యదర్శిగా నియమించి అణగారిన వర్గాల సాహిత్యాన్ని, సంస్కృతిని అణగదొక్కుతున్నారు. ఈ పరిస్థితిలో ముక్కలు ముక్కలుగా కులాలు విడిపోయి అసలు అస్తిత్వం, ఆత్మగౌరవం మరిచిపోతున్నాయి. రాజ్యయంత్రంలో భాగం కాకుండానే చాలా దూరంలోనే ఆపివేయబడుతున్న వైనాన్ని గుర్తించలేక పోతున్నారు.
ఇప్పుడు ఈ శక్తులలో ఐక్యత ఎలా సాధ్యం? ఐక్యభావనని పెంచే సైద్ధాంతికత ఎలా ఉండాలి? ఈ దేశ చరిత్రని మార్చడానికి, వర్గమూలాలు దాచి ఉన్న కులాన్ని నిర్మూలించాలి. ఇప్పటికే కులాన్ని గుర్తించని అతివాద మితవాద విప్లవవాద నిర్మాణాలలోని బ్రాహ్మణీయ భావజాలం ఈ విషయాన్ని గ్రహించినప్పటికీ, బహిరంగంగా ఒప్పుకోవడానికి నిరాకరిస్తోంది. ఆలోచనాపరులు ఇప్పుడు ఏం చేయాలి? వర్గాలకన్నా ఇక్కడ ‘కులం’మరీ అపాయకరం. సైద్ధాంతిక జ్ఞానాన్ని సైతం తప్పుదోవ పట్టించే నేతలను, మేధావులను వారి స్థానాల నుండి దించేయక తప్పదు. లేదా వారికి హాలిడే ప్రకటించగలగాలి. సమసమాజం ఏర్పాటు సాధ్యమయ్యే క్రమంలో పీడిత కులాల మధ్య ఐక్యత పెరగడం ముఖ్యం. ఒక్క ఐదేళ్ళు కుల సంఘాల నాయకులు దోపిడీ వర్గాలకు ఊడిగం చేయకుండా స్వేచ్ఛగా, ధైర్యంగా ప్రజలమధ్య పనిచేయగలిగితే ఐక్యత త్వరగా సాధ్యమవుతుంది. సంస్థల లెటర్‌హెడ్స్ కన్నా, ఆయా జనసమూహాలు ముఖ్యం. ఈ నాయకులకు వేదికలంటే మహాప్రేమ, ప్రజలంటే పెద్దగా పట్టింపులేదు. ఇది సరికాదు. అందువల్ల ప్రజలు ఇతర పార్టీలు, నిర్మాణాల కింద ర్యాలీ అవుతున్నారన్నది వాస్తవం. గత ముప్పై ఏళ్ళుగా కుల వర్గ ఆధిపత్య అణచివేతలను ని రసిస్తూ ప్రజోద్యమా లు చేసిన నాయకులు చాలామందే ఉన్నారు. వీరు తమ అనుభవాలను పం చుకుని ఒక ప్రణాళిక రచించుకోగలిగితే, దాని ప్రకారం ప్రజలను సమీకరించగలిగితే కొత్త చరిత్ర సాధ్యం. ఈ ఆలోచనే చీరాల సదస్సుకు మూలం.
ఈ దేశంలో జన సమీకరణ రాజ్యాధికారం దిశగా జరగాలి. ఐతే ఏ సామాజిక కులవర్గం నేతృత్వం వహించాలన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనికి జవాబు ఏమిటంటే- ఎవరైతే సరైన సైద్ధాంతిక చట్రం నిర్మిస్తారో, దానిని కాలానుగుణంగా ఆచరణలో పాటిస్తారో, త్యాగాలు చేసి జీవితాలను పణంగా పెడతారో, నలుగురిని కలుపుకుని, రాబోయే రోజుల్లో శత్రువులకి, ప్రలోభానికి లొంగకుండా ఉంటారో ఆ బృందమే నాయకత్వం వహించడానికి అర్హత సాధిస్తుంది.
ఒక్కో దశలో ఒక సామాజిక వర్గం ఇతరులను తనతో కలుపుకున్న బృందంగా పోరాడాలి. ఒకేసారి అనేక పోరాటాలు జరగాలి. రాజకీయ పోరాటానికి ముందు సాంస్కృతిక పోరాటాలని నిర్మించడం అవసరం. దీనివల్ల ప్రజలలో ఉన్న సాంస్కృతిక కుల హెచ్చుతగ్గుల్ని నిర్మూలిస్తూ ముందుకుపోగలరు. రాజ్యాధికారాన్ని మాత్రమే పొందితే అనతికాలంలోనే అంతర్గత కుమ్ములాట ముప్పు ఉంటుందని గ్రహించాలి. విశాల ఐక్యవేదిక నిర్మాణంలో సమాన హోదా, పదవులు ఉండాలి. తక్కువ సంఖ్య, ఎక్కువ సంఖ్య కాదు. ఎవరైతే యుగాలుగా బాధితులో వారికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. అలాంటి వారిలో నాయకత్వం వహించగలితే వారు లేకపోవచ్చు. కాని కొంతమందిని తయారుచేసుకునే దీర్ఘకాలిక ఆలోచన ఉండాలి. ఇదే నిజమైన సామాజిక న్యాయం పునాది. మొదట మతాధిపత్య రాజకీయ వ్యతిరేకత, ధనిక దోపిడీ వర్గాల నిలవరింత, పెట్టుబడి శక్తులను బలహీన పరిచే పాలసీల రచన.. ఒక్కొక్కటిగా చేపట్టాలి. కుల స్థిరీకరణ పెరిగే ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకట్ట వేయాలి. పాలకవర్గాల ధాటిని ఆపగలుగుతూ శ్రామిక జన సంక్షేమ విధానాలను ప్రవేశపెట్టాలి. రాజకీయ ఏకీభావన కలిగిన శక్తుల కూటమి (విశాల ఐక్యవేదిక)ని నడపడానికి, మార్గదర్శనం చేయడానికి దేశీయ, అంతర్జాతీయ మేధావులతో కూడిన సలహా, సూచనల కమిటీ అవసరం. ఇందుకు కావలసిన భావజాల నిర్మాణం ప్రజా సంస్కృతిలోంచి రూపొందించగలగాలి. నిర్మాణాలను పకడ్బందీగా అంతర్జాతీయ నైపుణ్యస్థాయిలో సమీకరించాలి. ఈ పోరాటంలో రాజకీయ శత్రువు ఫలానా అంటూ ఉండరు. కలసిరాని వారు ఎవరైనా ప్రజాశత్రువే. చివరగా మనవాడైనాసరే. వారు మన వర్గాలలోని వారూ కావచ్చు అనే స్పృహ ముఖ్యం. అశేష జన మతాలలోని మంచిని క్రోడీకరించే ప్రయత్నం జరగాలి. మానవ విలువలు, జీవితం ప్రాతిపదికన రాజకీయ తాత్వికతని పెంపొందించాలి.
ఊరు, వాడ, గూడెం, పట్టణం వేరు వేరు కావచ్చు. అందులో నివసించే ప్రజలందరూ ఒకటే. వీరందరూ ఒక తాటి మీదకు రావడానికి దోపిడీ, అణచివేతల నుండి నిష్కృతి కోసమే అని నమ్మాలి. బ్రాహ్మణీయ శక్తుల అజమాయిషీలో చాలాకాలం చాలామంది పనిచేశారు. ఇప్పుడు కేవలం ఒక దశాబ్దం కలసికట్టుగా పనిచేయడానికి సిద్ధం కావాలి. రాబోయే వందల ఏళ్ళు మన రాజ్యాన్ని మనమే పాలించే ఆలోచన కోసం. కేవలం ‘ఓటు’ప్రాతిపదికే కాకుండా తరతరాల హీనత నుండి విముక్తులం అవుతామనే ఆలోచన ముఖ్యమే.
కుల నిర్మూలన కోసం వర్గ అణచివేత, వర్ణ వివక్ష వంటి రకరకాల అనుభవాలను అధ్యయనం చేయడం మరవొద్దు. కుల నిర్మూలన జరిగే క్రమంలోనే ప్రజలపై ఇతర రాజకీయ పార్టీలు, ప్రాబల్యం తగ్గిపోతూ ఉంటుంది. విముక్తి మానవుడి ఆత్మశక్తిని కలగలుపుకుంటూ, కొత్త మనిషికి నిర్వచనం ఇస్తూ, అలాంటి మానవుడిని రూపొందించేందుకు ‘చీరాల అనుభవం’ పనికి వస్తుందని నాకు నేను ఆశ్వాసన ఇచ్చుకున్నాను. అర్ధరాత్రి మిత్రులు వీడ్కోలు పలకగా రైలునిండా కలలుకంటూ వేకువన హైదరాబాదు చేరుకున్నాను. ఒక చిన్న ఆలోచన ఎంతో బలాన్ని ఇచ్చింది. రేపటి భారతదేశ కొత్త పటానికి ఊపిరిలూరింది. ఇక కార్యాచరణ ప్రారంభమైతే ఇంకెంత బాగుంటుందో. కలలు కొన్ని నిన్నటిలాగానే మిగిలిపోవు. అవి రేపటివి కూడా.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242