తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఉద్యమ సంరంభ సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న ప్రజాకవి గూడ అంజయ్య, ప్రొఫెసర్ జయశంకర్‌ల వర్థంతి రోజు.
ఎన్నో ఆలోచనలు. రెండు దశాబ్దాల కుదుపులు. ఇంకా ఆరని తెలంగాణా కుంపటి. విడి రాష్ట్రాలు ఏర్పడ్డాక లబ్ధిదారులు ఎవరని ప్రశ్నించుకుంటే ప్రజలకన్నా అదృష్టవంతులు పాలకవర్గాలే, వారి తొత్తులే హాయిగా ఉన్నారు.
ఏదో తెలియని విషాదం. పైపైన మాత్రం సబ్ టీక్ హై అన్న హూంకరింపు.
అంజయ్యలు అనేకం. వారు సృష్టించిన సాహిత్య రాశి చాలా పెద్దది. ఒక్కసారి ఆ సాహిత్యం అంతా గుర్తొస్తున్నది. అందుకే ఈ నాలుగు మాటలు.
‘ఉద్యమం’ తెలంగాణకు సఫిక్స్. అది ఎన్నడూ స్తబ్దం కాదు. నిశ్శబ్దం కాలేదు. ఇక్కడ ‘విరామం’ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈనాటిదాకా అదొక సుదీర్ఘకావ్యం. స్వరాష్ట్రం ఏర్పడినా, స్వపరిపాలన, సామాజిక పాలన దిశగా పురోగతి సాధించవలసి ఉంది. జనసమూలలో ఆలోచనల అంతర్యుద్ధ భావాలను పరిహరించవలసి ఉంది. తిరిగి సాహిత్యం పునరుద్భవించవలసి ఉంది. ఉద్యమం అంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాహిత్య చలనం, కదలిక అని అర్థం. రాజకీయ చలనం ఆగి, అధికార ఆసనాల క్షేమ స్థిరీకరణ దగ్గర నిలిచిపోయింది. కాని ఒక కదలిక ఇంకా తెలంగాణ సమాజాన్ని వీడడం లేదని అనిపిస్తోంది.
ఒక ‘కుదుపు’కోసం పెనుగులాడుతున్న దృశ్యం. గత వలస నమూనా సంక్షేమ చట్రం, విధానం నుండి బయటపడాలని ఆకాంక్ష. ఈ తలకిందుల పిరమిడ్‌ని సజావుగా నిలపాలని అక్షరాల కదలిక. ‘ఐదేళ్ళ’ మొదటి కాలం నిరీక్షిస్తున్నది. మూడేళ్ళు గడిచిపోయాయి. అంతరాత్మల ఏకీకరణ కోసం కాలాలు పునరేకరింపబడాలని ఆశిస్తున్నాయి. కలాల భుజాలమీద బాధ్యత వేలాడుతున్నది.
వందేళ్ళ ఉద్యమాన్ని పునఃసమీక్షించుకున్నప్పుడు ప్రజా సాహిత్యం నిలువెత్తుగా, శిఖరప్రాయంగా కనబడుతోంది. అది కదిలే సాహిత్యం. నాలుక నుండి స్వరాలకు, గళాలనుండి హృదయసీమలకు. అక్షరం ధ్వనులై, ధ్వనులు సంగీతమేరు జలపాతాలై హోరెత్తిస్తున్నాయి. ఉద్యమం ముందా అక్షరం ముందా చెప్పలేం. ఒకదానికొకటి గోత్రం పేగుంబంధం. రెండు రంగాలలో ఏకకాలంలో ఆకాంక్ష వ్యక్తం కావడం గమనార్హం.
ఉద్యమాల చరిత్రపై తీర్చిదిద్దిన వీర తిలకంగా అక్షరం ఉద్యమం వెంటే పయనించింది. నడవల్లోంచి, నట్టింట్లోంచి, డ్రాయింగ్ రూముల్లోంచి, సమావేశ మందిరాలనుండి తనను తాను విముక్తమైంది.
ర్యాలీలు, పికెటింగులు, ఊరేగింపులు, ధర్నాలు, దీక్షలు, నిరాహారదీక్షలు, శవయాత్రలు, రాస్తారోకోలలో కవిత్వ చరణాలు కదం తొక్కాయి. జానపద సంగీత వాద్యాలు, పల్లవులు, వాటిముందు, ముందువరుసలో నిలిచాయి. ఆదివాసీ ప్రాంతాలలో తుడుం మోగింది. గోండీ, కోయ, చెంచు భాషలలో గానం ప్రతిధ్వనించింది. ఉరుదూ వంటి మైనారిటీ భాషా పదజాలం తెలంగాణా అస్తిత్వానికి ప్రతీకలా నిలబడింది. తెలంగాణా భాష వేరుపడి వేల ఏళ్ళనుండి ఒక్కటిగా చెప్పబడిన సీమాంధ్ర తెలుగు భాషని పక్కనపడేసింది. పారసీకం, అరబీ, ఉర్దూ భాషా పద సంపద తెలంగాణా భాషకి ప్రత్యేకతనే కాదు, విలక్షణ కవచమై నిలిచింది. మాండలికాలలో రచనలు ఎగిసిపడ్డాయి. నోస్టాల్జియా కూడా ఒక అద్భుత పరికరంగా సాహిత్యానికి ఇతివృత్తమైంది. ఇదంతా ఉద్యమ సాహిత్యపు ఒరవడిలో భాగమే.
అమరవీరుల మరణం విషాదమే. అయినా అది ఉద్యమ లక్ష్యంతో అనుబంధించినది కావడంవల్ల అప్పటికప్పుడు అతడిపై పాటో, కవితో అల్లబడి పాడబడింది. ఆ తరువాత అచ్చులో ప్రత్యక్షమైంది. అంత్యక్రియలలో సైతం తెలంగాణ పాట ప్రధాన పాత్ర వహించింది. శవయాత్ర కూడా మార్చింగ్ గీతమైంది. విషాదం ఆగ్రహ నుడికారమై వెలువడింది.
సామెతలు కూడా సాహిత్య ప్రక్రియ అయినప్పుడు ఉద్యమ నినాదాన్ని కూడా ౄజశ్యూ జఆళ్ఘూక ళశూళగానే ఛూడాలి. ఎనె్నన్నో పల్లవులు, నినాదాలు. ఒక్కో దశలో, ఒక్కో కాలంలో వెలువడినవి చాలానే ఉన్నాయి. ఒకరు నినదిస్తే వేలాది మంది ప్రతిధ్వనించారు. అలాంటి ప్రభావం చూపే నినాదాలను సాహిత్యకారులు ఇప్పటికీ గుర్తించలేదు. వాటిని సేకరించలేదు. నినాదమే ఉద్యమానికి సంకేత రూపం. హిందీ, తెలుగు అనే భాషా భేదం లేకుండా పాట నిర్మింపబడింది. అలాంటి పాటల రచనా సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
గత పదిహేనేళ్ళలో ఏ ఉద్యమంలో లేని విధంగా మండల కేంద్రాలలో, జిల్లాలలో ధర్నా చౌక్‌లు వెలిశాయి. అక్కడ ఉదయమే ‘జయ జయహే’ తెలంగాణ పాట లౌడ్‌స్పీకర్‌లో సుప్రభాత గీతమై మేల్కొలిపేది. ధర్నాచౌక్ వౌఖిక సాహిత్యం మారుమోగే వేదికగా పనిచేసింది. ఎన్నో ధర్నాచౌక్‌లు ఏడాడికిపైగా కార్యకలాపాలు నిర్వహించాయి. ‘‘జై బోలో తెలంగాణ’’ వంటి ఉద్యమ సినిమా ప్రదర్శనల సమయంలో సినిమా హాళ్ళలో తెలంగాణా ఉద్యమ పాట సామూహిక నృత్య క్షేత్రమయ్యింది. వేలాది రౌండ్ టేబుల్ సమావేశాలు పది రాష్ట్రాలలో నిరంతరాయంగా ఏర్పాటయ్యాయి. ఆ సభలు సాహిత్యం లేకుండా జరగలేదు. కవులు, రచయితలు, పాత్రికేయులు కవిత్వ పఠనాలు, సమ్మేళనాలు నిర్వహించారు. వేలాది గాయకులు మూకుమ్మడిగా ప్రదర్శనలు ఇచ్చారు. ధూంధాలు అనే ఒక కొత్త గాన కళా ప్రదర్శన జనాన్ని ఉర్రూతలూపింది. అదొక సాహిత్య సాంస్కృతిక కళారంగ ఉద్యమం. అది తెలంగాణ ఉద్యమంలోంచి రూపొందించిన నవ్య సాంస్కృతిక ప్రక్రియ. ఒక్కో పాట పది మెషిన్ గన్నులై పేలింది. పాటలు రికార్డు చేసి, వేలాది సీడీలుగా, పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోనులో ఇప్పటికీ ఉద్యమ గీతాలు రింగుమంటూనే ఉన్నాయి. ఇంటర్నెట్, ఫేస్‌బుక్కుల్లో, వాట్సప్‌లో కళాకారులు పాడిన దృశ్యాలు ఇంకా ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి.
ఉదాహరణకి- ఉద్యమంలో వెలువడిన సామెతలు, నుడికారాలు, నినాదాలు, పల్లవులు, కవిత్వ చరణాలు గోడలమీద, కరపత్రాలలో, బేనర్లపై, హోర్డింగులపై దర్శనమిచ్చాయి. ఇలాంటి లఘు ప్రక్రియలను ఒఖఇఆళ చ్యిౄఒ లేదా ౄజశ్యూ చ్యిౄఒఅని అంటారు. ఇవి ఇంకా పరిశీలకుల, పరిశోధకుల దృష్టికి రాలేదు. మరోవైపు ఎన్నో దీర్ఘ కవితలు, కావ్యాలు అచ్చయ్యాయి. పదిహేనేళ్ళుగా తెలంగాణ రచయితల వేదిక వంటి ఎన్నో సంస్థలు నిరంతరాయ సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటుచేశాయి.
ఉద్యమ సాహిత్యం ‘దేశి’గా గుర్తిస్తారు కొందరు. దేశి లేకుండా ‘మార్గ’కు ప్రాణవాయువు లభించదు. కాని ఈ ‘మార్గ’ సాహిత్యమే దేశీని కించపరచాలని చూస్తుంది. ఈ విలువల చట్రాన్ని గమనించి ఉద్యమ సాహిత్యాన్ని ఉత్కృష్ట రచనగా చెప్పే సాహిత్య విమర్శ కూడా పెరగాలి.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242