తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

కవిత్వ కర్తవ్యం తెలిసిన కవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్క సురేష్ ఒక చక్కని ప్రశ్న వేశాడు.
‘జ్ఞానపుష్పం’ కవితా సంకలనం చేతిలో ఉంచి ముందుమాట రాయమని అడుగుతూ -‘కవిత్వం అంటే ఏమిటి’ అనే ప్రశ్న సంధించాడు.
సాహిత్య ప్రపంచంలో కవిత్వం ఒక అత్యంత సుందరమైన ప్రదేశం. దాని లోలోన బడబాగ్ని కదలాడుతుంటుంది. అందమైన సముద్రతీర ప్రాంతాన్ని సునామి దాడి చేసినట్టు అక్కడ వినిర్మాణ ఛాయలు అనేకం. ఐనా ఏదో ఒక అనిర్వచనీయ అలౌకిక వాతావరణం. అక్కడున్నని వైవిధ్యాలు, వైరుధ్యాలు మరెక్కడా ఉండవు. వాయుశక్తితో విద్యుత్ పుట్టించినట్టు, సౌరశక్తితో వెలుగులు ప్రసాదించినట్టు, జల బలంలో వేల ఓల్టుల కాంతి కేంద్రమైనట్టు, సముద్ర తరంగ శక్తిని కేంద్రీకరించి శక్తిని సృష్టించినట్టు కవిత్వంతో అక్షర అణు అగ్నిని వెలిగించవచ్చు.
లయబద్ధమైన తూగు, పదాల పొందిక, శబ్ద సంకేతాల అమ్ములు, శైలీ సహిత నడకలోని సంరంభమే కవిత్వం. దానికి ప్రయోజనం అన్నది ఐచ్ఛికం. ఏదో కవి ఉద్దేశం ఒకటి కావడిబద్దకు కుండలా ఊగుతూనే ఉంటుంది. ప్రజలకోసం రాసిన వచన కవిత ప్రజలకు చేరుతుందా అన్నది ప్రశ్న. ఐతే అది ఎలా అనే ప్రశ్నలకు సదా లభించదు సమాధానం. వర్తమాన కవిత్వం తన అస్తిత్వాన్ని తుంచుకుంటున్నదని, కొందరు, పెంచుకుంటున్నదని మరి కొందరు.
ఏది ఏమైనా ‘కవిత్వం’ విచిత్ర పదార్థంలాగ మారింది. ‘కవి’ ద్వందహ్యమాన దశాబ్దాలలోంచి అగ్ని స్వరూపంతో వెలిగింది. ఇప్పుడు బురద పూసుకుని సెంటు వాసనల కోసం నిరీక్షిస్తున్నది.
ఇప్పుడు కవిత్వం అంటే పురస్కారాల కోసం నిరీక్షణ. కవిగారు శాలువాల కోసం నలు దిక్కులా పరుగులు తీస్తున్న నాలుగు శరీర భాగాల ఒక మాంస ఖండం.
భావ సాంద్రతని కవిత్వంలో పొదగవలసిన వాడు. జన సాంద్రతలోకి విస్తరించవలసినవాడు. కలాల్ని ఎరగా చేసి పాలకుల కరుణాకటాక్ష వీక్షణల మత్స్యాలకోసం వేట సాగిస్తున్నాడు. వేటగాడు ఒడ్డున లేడు. బురద గుంటలో అడుగడుగు తచ్చాడుతున్నాడు. అదే సుగంధం. అక్కడే సౌఖ్యం. తాను వానపాము. తానే చేపపిల్లనే, వేటగాడు తానే. వేటాడబడేదీ తానే. ఈ పరిస్థితి ఏనాడూ లేని, అతి నవీన వాతావరణం. సామూహిక సత్కార యజ్ఞంలో ఒక సమిధ కావడానికి జీవిత కాల నిరీక్షణ. ఆలస్యం అయితే అందుకోవలసిన శాలువా ఉరితాడై కాటేస్తుందేమోనన్న బాధ.
ఏది కవిత్వం అంటే, ఎవరు కవి అనే ప్రశే్న సరైనదని సురేష్‌కి చెప్పాలనిపిస్తోంది. ఘనీభవించిన భావనలోంచి ఒక సంకేతాన్ని ఎత్తిపట్టిన లాంతరు చేయాల్సిన కవిత్వం, దీపదారి లాంతర్లని పక్కన పడేసి శాలువా పోగుల కోసం దేవులాట! తన ప్రపంచంలో ప్రజలు తనతోపాటే వున్నారని మరిచాడు. విస్మరణ, విస్ఫోటనాన్ని వినిపించుకోని బధిరత. కవిత్వానికి ఒక ప్రయోజనం ఉంటుందని మరిచిన విపరీత రోగ గ్రస్తత. ప్రజలు కొన్ని సమస్యల కోసం పోరాడుతున్నారన్న వాస్తవికతని నమ్మలేకపోవడం విషాదం.
తన కవిత్వం చదివి స్ఫూర్తి పొందాలని అసలే లేదు. ప్రేరణ కలిగించే కవిత్వం రాసిన వాడినని తనకి గుర్తేలేదు. నిద్రలో నడిచినట్టు కలలో శాలువాలు మోయలేక కూలబడినట్టు, సత్కార సభలో తన కలాన్ని ఎక్కడో పొడగొట్టుకుని, మరో చోట చీకట్లో వెతుక్కుంటున్నాడు. కింద, నేల మీద అక్షరాలు ఒక్కొక్కటి నవ్వుతుంటే శాలువా పోగులతో వాటి నోరు మూయిస్తూ మూయిస్తూ అలసి సొలసి పడిపోయాడు.
తన భాషని, భావాన్ని, కవిత్వ గౌరవాన్ని శాలువాల ప్లాస్టిక్ పోగులకోసం పణంగాపెట్టి, కవిగా ఎదగాలని కూడా ప్రయత్నాలు చేయడం ఇటీవలి ధోరణి. నిజానికి కవిత్వం అమోఘమైన మానసిక శక్తి. ఊహాబలం, వాస్తవికతల మేలు సమ్మేళనం. కవి వాస్తవ సమాజాన్ని, మనుషులను, సంభవించే పరిణామాలను చేజేతులా విస్మరిస్తున్నాడు. సమాజ బాధ, విషాదం, ఆవేదనను కవితారూపం ద్వారా వ్యక్తీకరించే విధానాన్ని పక్కనపెట్టి వ్యక్తితాముద్రని కాగితం మీద లైనులుగా పేరుస్తూ పోతూ ఉన్నాడు. మారిన తన కాళ్లకింది నేల కొత్తది. ఆ నేలలోని సారాన్ని పాదాల మూలాలనుంచి స్వీకరించలేక, గాలిలోని రాజకీయ తేమకి నెమ్మదిగా అలవాటు అవుతూ అదే జీవసారం అని అనుకుంటున్నట్టు ఉన్నాడు. కవిత్వ అగ్నిగోళాలని కాగితాలపై బేలన్స్ చేయవలసిన వాడు, కాగితం కాలిపోవడం తనకు ఇష్టం లేదని బొంకుతున్నాడు. అది నష్ట్భావన అని, తనలోని నిప్పుని ఆర్పేసుకుంటూ, ఎస్టాబ్లిష్‌మెంట్ ఫైరింజన్ల సహాయాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు.
వ్యక్తిగత బాధ వేరు. సమాజ విశాదం వేరు. సమూహ భావన వేరు. కవి,తన కవిత్వం, రచన, పాఠక ప్రపంచం సైతం వ్యక్తిగత పరిధిలోకి కుదింపచేస్తున్నాడు. అందువల్ల కవిత్వ లయ లుప్తమైంది. కవిత్వం అక్షరాల సంగీత ధ్వని వినిపించని చీకటి గదికి పరిమితమైంది.
కొండలు, గుట్టలు లారీపై ముసుగు వేసుకున్న శిలలై లారీలలో కళ్లముందే స్మగులైపోతున్నాయ. ప్రకృతి విషాద, పర్యావరణ విధ్వంసం చూసీ చూడనట్టు నటించడం ఫాషనైంది. ఓపెన్ కాస్ట్ తవ్వకాలతో ఊళ్లు బీడుభూములుగా కాదు, నేలే శవమై, కుళ్లి శరీరంనుండి తెగిపడి నల్లని భయం కొలిపే కందకాలయ్యాయి. కంటి తెరపై కానవచ్చే ఆ దృశ్యాల బదులు అభివృద్ధి కాల్పనిక కలల పోస్టర్లని అతికించుకున్న కలాలు ఏం రాస్తాయిప్పుడు.
డిలాన్ థామస్ ఇలా అంటాడు-
ఔ్యళఆక జఒ ఘ ఔఖఔఔళఆఒ్ద్యతీ, త్దీళూళ జజూళూఒ యచి ఒరీక్యూషరీళఆఒ ఘశజూ జూజ్పళూఒ యచి ఒళ్ఘ చ్ఘిఆ్ద్యౄఒ యఒఒజఔ ఘఇ్యఖఆ ఆ్దళ ఒజనఆ్ద ఒళశఒళ ఘశజూ ఆ్దళ ఛ్యిఖూఆ్ద జూజౄళశఒజ్యశ అని అంటాడు.
రాబోయే కాలంలో సంభవించే అసమంజస్యాలను పసిగట్టని సిక్స్త్ సెన్స్‌కి అల్లంత దూరమైన కలాలకు కలలు కనడమే కర్తవ్యం అయ్యంది. బలవంతంగా కలలు కనడమే లక్ష్యం. ఆ కలలను పంచుకోవడమే విధి అయింది. ప్రతి దృశ్యానికి గల ఫోర్త్ డైమన్షన్‌ని విప్పి చెప్పలేని వైకల్యంలో సృజన కొట్టుమిట్టాడుతున్నది.
-ఉంటే మంత్రుల బొచ్చుకుక్కగా ఉండు. లేదా ముఖ్య పేషీలో కరణం రాతగానిగా కుదురు. అందుకోసం నిన్ను నీవు అందుబాటులో ఉంచుకో. లేదా ఆ అవకాశం కోసం ‘జీ హుజూర్’ అంటూ ఫోను పిలుపుల కోసం వేచి ఉండు. లేదా వేచి ఉండే ఓపిక లేకపోతే నీ ఒంటిని ఖాళీ డబ్బాగా చేసి కలం పుల్లతో శబ్దం చేస్తూ ఉండు. గుర్తింపు కోసం వందలాదిమంది ఉండే రైల్వే సాధారణ వెయిటింగ్ రూంలో రైలు కోసం నిరీక్షిస్తున్నట్లు నిరీక్షించు.
పిలుపు రాకపోయినా ఫరవాలేదు. కొన్ని శాలువా పోగుల వాసన ఊహిస్తూ, చూస్తూ, తోక ఊపుతూ, సొంగ కారుస్తూ ఉండు. ఇదీ ఈనాటి అసలు పటం బొమ్మ. ‘కవులూ రచయితలూ మీరేవైపు’ అన్న ఆనాటి విశాఖ విద్యార్థుల కరపత్రం ఇవ్వాళ కుహనా విప్లవ వాదులు ఆమడదూరం నెట్టివేశారు. ‘మేం ముఖ్యమంత్రి, మంత్రుల పేషీలవైపు. రాజ్యంలో నిరంతరం ఊగే తోకల దిక్కే’ అని చెప్పకనే చెబుతున్నాయి వాటి వైఖరులు. ఇప్పుడు ఒక కొత్త నినాదమై ఆచరించబడుతున్న సమయం. ‘చేస్తే విప్లవం చేస్తున్నట్టు నటించు. లేదా చెట్టాపట్టాలతో రాజ్యంతో కౌగలింపు’ అదే కలాల పరిస్థితి నేడు.
ఇప్పుడు రాజధానిలోని ఒక విప్లవ నేత బాధ ఏమిటో తెలుసా? పాపం! ఆ విప్లవ కారుడు, తన మిత్రుడు రాజ్యయంత్రంలో ముఖ్య మరగా ఉంటూ ఎంత బాధపడుతున్నాడో! అని తాను సంతాపం ప్రకటిస్తాడు. ఆహా ఏమి విప్లవ కామ్రేడరీషిప్! ఎంతటి పట్టపగటి లౌక్యం. ఇలా ఎన్నిసార్లు రాజ్యంతో కరచాలనాలు చేశారో కదా! ఇది చిట్ట చివరిది కావాలని ప్రజలందరి భావన.
శ్రమజీవి వర్గాల వర్గ, కుల పెత్తందారీ పోకడలను గుర్తించాల్సినవారు, అలాంటి భావనని పెంపొందించాల్సిన కాలంలో నేతలు, పాలకవర్గాలతో, అధికార యంత్రాంగంలో తమ తమ వర్గ కుల మిత్రుల కరచాలనం కోసం చేస్తున్న ఈ నయా విప్లవం చాలా గొప్పది. ప్రజలు వారికి సన్మానాలు చేయవలసి ఉంది.
నక్క సురేష్ 2003 నుండి కవిత్వం రాస్తున్నాడు. మనిషి ఆవేదనలు, సమాజం సంవేదనలు కలిపి రాయడం బాగనిపించిన గుణం. నరేశ్ వేసిన ప్రశ్న నన్ను చాలానే ఆలోచింపజేసింది.
చాలామంది కవులు తమ కవిత్వం గురించి తామే కవితలు ‘కవిత్వం’ అనే కవితలో రాస్తారు. సురేష్ కూడా రాశాడు. ‘కొందరిని ప్రశ్నించి అందరినీ తట్టి నడిపేదే కవిత్వం’ అంటాడు. ప్రశ్నించనిదే కవిత్వం లేదంటాడు. కాదంటాడు. అందుకే తనని తాను ప్రశ్నించుకునే ప్రయత్నం కూడా చేశాడు. వలస పాలనని ధిక్కరించాడు. ప్రత్యేకతని ఆహ్వానించాడు. ఇప్పుడు-
‘‘యాగాలు, లాబీయింగ్ తెలుసు/ రుచి చూసిన పళ్ల రసం తెలుసు
భగ్గుమన్న ఉస్మానియా తెలుసు/ అంది పుచ్చుకున్న కాకతీయ తెలుసు
పెట్రోలు మంటలో మాడిన/ బిడ్డల త్యాగం తెలుసు/ ఉడుకు నెత్తుర్ల యువత
ఉద్యమాల సెగలు తెలుసు’’-అంటాడు. జిగేలుమనిపించే గొప్ప కవిత్వ భాష లేకపోయినా, కళ్లు తెరిపించడం ఎలానో తెలిసిన విద్య ఇది. పొత్తం చిన్నదే. దానిలోని ఆలోచనల విత్తనాలు శక్తి కలిగినవి. తన కవిత్వ కర్తవ్యం ఏమిటో తెలుసుకున్న కవికి స్వాగతం. ప్రశ్నని సంధించినందుకు, కవిత్వం చేసినందుకు అతడికి ప్రత్యేక అభినందనలు.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242