రాష్ట్రీయం

అక్రమ రైల్వే టికెట్ల గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరి అరెస్టు: 152 టిక్కెట్లు స్వాధీనం

హైదరాబాద్, డిసెంబర్ 6: ఆన్‌లైన్ ద్వారా అక్రమంగా రైల్వే టిక్కెట్లు విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.
ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి రూ. 3,67,953ల విలువ చేసే 152 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎం ఉమాశంకర్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారిని అమిత్ గాంధీగా పోలీసులు గుర్తించారు.
నగరంలోని అబిడ్స్‌లో గల ఒయాసిస్ ప్లాజాలో దిశా ట్రావెల్స్‌ను ఏర్పాటు చేసుకున్న అమిత్ గాంధీ మాజీ ఐఆర్‌సిటిసి ఏజెంట్. కాగా 35 పర్సనల్ ఐడిలతో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా రూ. 50/ రూ. 200/ల టిక్కెట్లను అక్రమంగా విక్రయిస్తున్నాడు. దీనికి ఫర్హాన్ అనే మరో యువకుడు తోడయ్యాడు. వీరిద్దరు అనధికారికంగా టిక్కెట్లు విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్‌పిఎఫ్ పోలీసులు దిశా ట్రావెల్స్‌పై దాడి చేసి అక్రమంగా రైల్వే టిక్కెట్లు విక్రయిస్తున్న అమిత్ గాంధీ, ఫర్హాన్‌లను అరెస్టు చేశారు. దాదాపు నాలుగు లక్షల రైల్వే టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారని ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. అనధికార, లైసెన్సు లేని ఏజెంట్లు/ట్రావెల్ ఏజెంట్ల నుంచి ఎలాంటి టిక్కెట్లు కొనవద్దని రైల్వే పోలీసులు ప్రయాణికులకు సూచించారు.