రాష్ట్రీయం

45 రోజులు గడువివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్టునుంచి అనుమతి తీసుకోండి
గ్రేటర్ రిజర్వేషన్లు అందలేదు
ఎన్నికల సంఘానికి విపక్షాల విన్నపం
రేపు కోర్టులో పిటిషన్: మర్రి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్/ బేగంపేట, జనవరి 2: జిహెచ్‌ఎంసి ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ ముగిసి, రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు 45 రోజుల సమయాన్ని కేటాయించాలని కోరుతూ విపక్షాలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరాయి. ఇందుకు ఎన్నికల సంఘం కోర్టును ఆశ్రయించి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని కూడా విపక్షాల నేతలు కోరారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఈ విషయంపై ఇదివరకే ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి లేఖను మెయిల్ చేశారు. అంతేగాక, శనివారం ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా స్వల్ప అనారోగ్యంతో నాగిరెడ్డి అందుబాటులో లేకపోవటంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి అశోక్‌కుమార్‌ను కలిసి రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత ఏర్పాట్లకు 45 రోజుల సమయమిచ్చి, తర్వాత ఎన్నికలు నిర్వహించాలని గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, నిరంజన్, శ్రీహరి ముదిరాజ్, బిజెపి గ్రేటర్ అధ్యక్షుడు బి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వెంకటరమణి, బిఎస్పీ నుంచి బాల య్య, ఎంబిటి పార్టీ నుంచి అం జదుల్లాఖాన్, వైఎస్సాఆర్సీ నుంచి శివకుమార్‌తో కూడిన బృం దం అశోక్‌కుమార్‌ను కలిసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు 45 రోజుల సమయాన్ని కోరుతూ తాను కూడా 4న సోమవారం కోర్టుకు పిటిషన్‌ను సమర్పించనున్నట్టు తెలిపారు. గ్రేటర్ డివిజన్ల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే అధికార పార్టీకి అంది ఉంటాయని, దాని ప్రాతిపదికన వారు వర్కవుట్ చేసుకునే అవకాశం ఉందని, ఇంకా తమ కు రిజర్వేషన్ల వివరాలు అందనందు కు రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వా త ఎన్నికల నిర్వహణకు 45 రోజుల సమయాన్ని కేటాయించాలని కోరినట్టు తెలిపారు. గతంలో కూడా ఇదే విషయాన్ని నిర్దారిస్తూ ఎ న్నికల సంఘం కోర్టులో అఫిడెవిట్లను దాఖ లు చేసిందని వివరించారు. గ్రేటర్ ఎన్నికల విషయంలోనూ రాజ్యాంగంలోని నిబంధనలను అమలు చేసే దిశ గా ఎన్నికల సంఘం కృషి చేయాలని కోరినట్టు తెలిపారు. గత నెల 29న జరిగిన ఆల్‌పార్టీ సమావేశంలో ఎన్నికల వ్యయాన్ని పెంచాలన్న ప్రతిపాదనకు స్పందించిన నాగిరెడ్డి పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉంటే చేయవచ్చునని ఎంతో అనుకూలంగా వ్యవహారించారని శశిధర్ రెడ్డి తెలిపారు. (చిత్రం) ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం సమర్పిస్తున్న విపక్షాల నేతలు