రాష్ట్రీయం

నేటినుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు, డిసెంబర్ 6: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టిటిడి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరు క్షేత్రం విద్యుత్ దీపకాంతుల నడుమ దేదీప్యమానంగా వెలుగొందుతోంది. టిటిడి ఉద్యానవన విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు చేశారు. తిరుపతి నుంచి తిరుచానూరు రహదారి పొడవునా ఫ్లెక్సీలు, వివిధ దేవతామూర్తుల డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. తిరుమాడ వీధుల్లో రంగవల్లులు వేశారు. పంచమీతీర్థం రోజున అన్నదానం చేసేందుకు వీలుగా రద్దీగా ఉండే ప్రదేశాలను గుర్తించి ముందస్తుగా భారీ షెడ్‌లను ఏర్పాటు చేశారు. అమ్మవారి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్పప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేయనుంది.
150 సిసి కెమెరాలతో ప్రత్యేక నిఘా
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని టిటిడి, పోలీసు యంత్రాంగం 150కి పైగా సిసి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకలపైన, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే గుర్తుపట్టేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
(చిత్రం) బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించిన దృశ్యం