ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి మొక్కుతీర్చుకున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులు, స్పీకర్‌, మం‍త్రులతో సహా బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత, అల్లుడు అనీల్, మనువళ్లతో కలసి ఆయన మహాద్వారం గుండా ఆలయం లోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ స్పీకర్‌ మధుసూదనాచారి, మంతులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ కవిత ఉన్నారు. ఏపీ ప్రతినిధిగా రాష్ట్రమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కేసీఆర్‌ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తిరుమల శ్రీవారికి కేసీఆర్‌ దంపతులు రూ.5కోట్లు విలువైన బంగారు అభరణాలను సమర్పించారు. 14.2కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65కిలోల బంగారు కంఠెను ఆయన సమర్పించారు. తొలుత కుటుంబసమేతంగా వరాహస్వామిని దర్శించుకున్నారు. వాహన మండపం నుంచి బ్యాటరీ వాహనంలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, కేసీఆర్‌కు స్వాగతం పలికారు.