రాష్ట్రీయం

తిరుమల కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వదర్శనానికి 12.. దివ్యదర్శనానికి 10 గంటలు
తిరుమల, డిసెంబర్ 26 : వేంకటేశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. వరుస సెలవు దినాల నేపథ్యంలో గత మూడు రోజులుగా రద్దీ కొనసాగుతోంది. ఈక్రమంలో శనివారం కూడా తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఓవైపు అయ్యప్పస్వామి భక్తులు, మరోవైపు సాధారణ భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయి, వైకుంఠ క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర బారులుతీరారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి 12 గంటలు, నడక దారిన వచ్చే భక్తులకు కల్పించే దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. 300 ప్రత్యేక దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. దీంతో వసతి కొరత ఎదురవుతోంది. గదులు దొరకని భక్తులు ఉద్యానవనాల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుండగా గత రెండు రోజులుగా తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. గదులు దొరకని భక్తులు చలికి విలవిల్లాడుతున్నారు. ఓవైపు విఐపి దర్శనాలను సోమవారం వరకు రద్దు చేశామని టిటిడి జెఇఓ ప్రకటించినప్పటికీ పైరవీదారుల ఒత్తిడి మాత్రం తగ్గడంలేదు. అయితే టిటిడి మాత్రం సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తుండడంతో సగటు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి దాటే సమయానికి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొనే అవకాశం ఉందని అంచనా.