క్రీడాభూమి

గుజరాత్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్
బెంగళూరు, డిసెంబర్ 28: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో హాట్ ఫేవరిట్ ఢిల్లీని 139 పరుగుల తేడాతో చిత్తుచేసిన గుజరాత్ విజే తగా నిలిచింది. కెప్టెన్ పార్థీవ్ పటేల్ బ్యాటిం గ్‌లో, ఆర్పీ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో చెలరేగి, ఢిల్లీపై గుజరాత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ పూర్తిగా విఫలమై 134 పరుగులకే కుప్పకూలింది. పవన్ నేగీ ఒంటరి పోరాటం చేసి, అర్ధ శతకాన్ని సాధించినప్పటికీ జట్టును ఆదుకోలేకపోయాడు.
ఢిల్లీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, గుజరాత్ ఇన్నింగ్స్‌ను పార్థీవ్ పటేల్, ప్రియాంక్ కిరీట్ పాంచల్ ఆరంభించారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో పాంచల్ (14) క్లీన్ బౌల్డ్ కావడంతో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన భార్గవ్ మెరాయ్ 5 పరుగులకే వెనుదిరగ్గా 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను పార్థీవ్, రజుల్ భట్ ఆదుకున్నారు. వీరు రెం డో వికెట్‌కు 149 పరుగులు జోడించారు. 193 పరుగుల స్కోరువద్ద భట్ (60) అవుట్‌కాగా, ఒక్క పరుగు కూడా జత కలవక ముందే పార్థీవ్‌ను పవన్ నేగీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 119 బంతులు ఎదుర్కొన్న పార్థీవ్ 10 ఫోర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. చిరాగ్ గాంధీ 44 (నాటౌట్) పరుగులతో రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో గుజరాత్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆలౌటైంది.
ట్రోఫీని కైవసం చేసుకోవడానికి 274 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ మొదటి బంతికే రిషబ్ పంత్ వికెట్‌ను కోల్పోయింది. అతను ఆర్పీ సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ 5 పరుగులకే ఆర్పీ సింగ్ బౌలింగ్‌లో మన్‌ప్రీత్ జునేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కెప్టెన్ గౌతం గంభీర్ (9)ను భట్ క్యాచ్ అందుకోగా ఆర్పీ సింగ్ అవుట్ చేశాడు. మిలింద్ కుమార్ ఖాతా తెరవక ముందే ఆర్పీ సింగ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఢిల్లీని పలు సంక్లిష్ట సమయాల్లో ఆదుకున్న ఉన్ముక్త్ చాంద్ వికెట్ల వద్ద నిలదొక్కుకోవడంతో అతను మరోసారి బాధ్యతా యుతమైన ఇన్నింగ్స్‌తో రాణిస్తాడని అభిమాను లు ఆశించారు. కానీ, 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతో 33 పరుగులు చేసిన అతనిని జస్‌ప్రీత్ బుమ్రా బౌల్డ్ చేయడంతో విజయంపై ఢిల్లీ ఆశలు వదులుకుంది. మానన్ శర్మ రెండు పరుగులు చే సి రనౌటయ్యాడు. నితీష్ రాణా అతి కష్టం మీద 12 పరుగులు చేశాడు. అతనిని రష్ కలారియా క్యాచ్ పట్టగా బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. సుబోధ్ భాటి మూడు పరుగులు చేసి, బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. ఇశాంత్ శర్మను కూడా బుమ్రా ఎల్‌బిగా అవుట్ చేశాడు. నేగీ 57 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో మెరాయ్ క్యా చ్ పట్టడంతో అవుటయ్యాడు. అతను చివరి వికె ట్‌కు నవ్‌దీప్ సైనీతో కలిసి 34 పరుగులు జోడిం చాడు. వీటిలో సైనీ ఒక్క పరుగు కూడా చేయలే దు. చివరి వికెట్‌కు వీరు 3.4 ఓవర్లు ఆడారు. వీటి లో సైనీ కేవలం ఒక బంతిని మాత్రమే ఎదుర్కొ న్నాడు. అతనిని రక్షణ కవచంలో ఉంచుకొని, స్ట్ర యకింగ్‌ను తానే కొనసాగిస్తూ నేగీ వ్యూహాత్మకం గా ఆడాడు. కానీ, అతని శ్రమ ఫలించలేదు. ఢిల్లీ 32.3 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 273 ఆలౌట్ (పార్థీవ్ పటేల్ 105, రజుల్ భట్ 60, చిరాగ్ గాంధీ 44 నాటౌట్, నవ్‌దీప్ సైనీ 2/46, సుబోధ్ భాటి 2/43, పవన్ నేగీ 2/36).
ఢిల్లీ ఇన్నింగ్స్: (ఉన్ముక్త్ చాంద్ 33, నితీష్ రాణా 12, పవన్ నేగీ 57, ఆర్పీ సింగ్ 42 పరుగులకు 4, జస్‌ప్రీత్ బుమ్రా 28 పరుగులకు 5 వికెట్లు).