జాతీయ వార్తలు

దాడులకు నిరసనగా రేపు తమిళనాడు బంద్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : కర్నాటకలో తమిళులపై దాడులకు నిరసనగా గురువారం తమిళనాడు బంద్‌కు తమిళ పార్టీలు పిలుపు ఇచ్చాయి. కావేరీ జలాల వివాదంపై కర్నాటక ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని తమిళ పార్టీలు ఆరోపించాయి. కర్నాటకలో పలు ప్రాంతాల్లో తమిళులపై దాడులు జరిగాయి. తమిళుల ఆస్తులను ధంసం చేశారు. లారీలు, బస్సులకు నిప్పుపెట్టారు. కన్నడనాట తమవారిపై దాడులు, ఆస్తులు ధ్వంసం కావడంతో తమిళులు ప్రతీకారంతో రగిలిపోయారు. రాష్ట్ర బంద్‌కు తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపు ఇచ్చింది. ఇక, కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్‌ చేశారు.