జాతీయ వార్తలు

మరుగుదొడ్డి లేదని విడాకులిచ్చిన భార్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: అత్తవారింట మరుగుదొడ్డి లేకపోవడంతో ఇబ్బంది పడిన ఓ కోడలు చివరికి భర్తకు విడాకులిచ్చేసింది. బిహార్‌లోని కొత్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బబ్లూకుమార్, అర్చనకు గత మే నెలలో వివాహం జరిగింది. పెళ్లయ్యాక అత్తవారింట చేరిన ఆమెకు అక్కడ మరుగుదొడ్డి లేదని తెలిసి భర్తను నిలదీసింది. పలుసార్లు ఈ విషయం అడిగినా పట్టించుకోని భర్త తన వద్ద డబ్బుల్లేవని చేతులెత్తేశాడు. అంతగా అవసరమైతే పుట్టింటి నుంచి డబ్బు తెచ్చుకుని ఇంట్లో మరుగుదొడ్డి కట్టించుకో.. అంటూ భార్యపై చిందులేశాడు. భర్త వైఖరితో విసుగెత్తిన ఆమె గ్రామ పెద్దల చేత పంచాయితీ పెట్టించింది. ఇంట్లో మరుగుదొడ్డి లేక తాను నిత్యం అవమానం పాలవుతున్నందున భర్తకు విడాకులిచ్చింది.