టాలీవుడ్‌పై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లోకి బాలీవుడ్ హీరోయిన్ల ఎంట్రీ ఎప్పటినుండో నడుస్తున్న అంశమే. తెలుగు చిత్రాల్లో నటించేందుకు వారికి అమిత ఆసక్తి వుండడం చూస్తున్నదే. తాజాగా మరో బాలీవుడ్ భామ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఆమె ఎవరో కాదు ముంబాయి మోడల్ కామ్న. ఈ భామ హీరోయిన్‌గా నటించేది అల్లరి నరేష్ సరసన. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రం ఈనెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా తరువాత నరేష్ నటించే చిత్రం సెట్స్‌పైకి రానుంది. ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ ఫేం ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో కామ్నను హీరోయిన్‌గా ఓకే చేశారట. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకోవాలని కామ్న తెగ ఆరాటపడుతోంది.