శ్రీకాకుళం

రేపు సంపూర్ణ సూర్యగ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, మార్చి 7: ఈ నెల తొమ్మిదోతేదీన సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా మండలంలోని ప్రఖ్యాత కూర్మనాథాలయంతో పాటు సాలిహుండాం శే్వతగిరిపై వెలసియున్న కాళీయ మర్దన వేణుగోపాలస్వామి, బూరవెల్లిలోని లక్ష్మినృసింహస్వామి ఆలయాలను మూసివేయనున్నారు. ఆరోజు ఉదయం 4-49నిమషాలకు ప్రారంభమైన ఈ గ్రహణం 10-05నిమషాల వరకూ ఉంటుంది. ఈ గ్రహణం సందర్భంగా సూర్యుడు సుమారు 3-61నిమషాల పాటు పూర్తిగా కనిపించడు. ఈ గ్రహణం నాటి ఉదయం ఆలయం తెరవక పోవడంతో స్వామి వారిదైనందిన కార్యక్రమాలు నిలిచిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణ గావించిన అనంతరం భక్తుల సందర్శనార్ధం అనమతించడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకుడు చామర్తి సీతారామ నృసింహాచార్యులు స్పష్టం చేసారు. ఈయనతో పాటుగా ఆర్చక స్వాములు ఉన్నారు. తుల, పూర్వాభాధ్ర వంటి నక్షత్ర జాతకులు ఈ గ్రహణం నాటి ఉదయం పదిన్నర గంటల వరకు బయటకు రాకూడదన్నారు.
వందే శివం శంకరం...
శ్రీకాకుళం, మార్చి 7: విభూది రేఖలే నుదిటి గీతలుగా, ఢమరుక మోతలే వేదములుగా, కంటి నిండ మంటలే కామదహనంగా, నెత్తినీల్లే పాపహరణంగా భక్తుల నీరాజనాలు అందుకునే పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం పట్టణంలోని పలు శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. శివునికి రుద్రాభిషేకాలు, అర్చన, రుద్రహోమం, కల్యాణం, తిరువీధి ఉత్సవాలు, విశేష అలంకరణ పూజలు జరిపారు. గుడివీధిలో పంచలింగ క్షేత్రం ఉమారుద్రకోటేశ్వరస్వామి దేవస్థానంలో ఆలయార్చకుడు అరసవల్లి శ్రీరామమూర్తి నిర్వహణలో ప్రథమార్చన సహిత పంచామృతాభిషేకంతో తెల్లవారుజామున మూడు గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓం హరహరమహాదేవ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ... అంటూ రాత్రి మహాన్యాస పూర్వక ఏకాదశ వార మహారుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. రాత్రి 12గంటలకు లింగోద్భవ పూజలు అనంతరం నంది వాహనంపై తిరువీధి నిర్వహించారు. రాత్రి సాయిస్వరరాగసుధ భక్తిసంగీత విభావరి జరిగింది. సోమవారం ఉమారుద్రకోటేశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకుని శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, జిల్లా జడ్జి పిబి. నిర్మలాగీతాంబ, దేవాదాయ శాఖ డిసి మూర్తి, ఎసి శ్యామలాదేవి తదితరులు ఉన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాళ్ల కిరణ్‌కుమార్, సభ్యుడు తెనే్నటి ఆదిత్యశాస్ర్తీ, ఇవో సన్యాసిరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుజరాతీపేట లక్ష్యేశ్వరస్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా పలువురు విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందేందుకు 108 ప్రదక్షిణలు చేశారు. కొన్నావీధి భీమేశ్వరాలయంలో గంటల చిన్నరామ్మూర్తి ఆధ్వర్యంలో అభిషేక పూజలు నిర్వహించగా దేవాదాయ శాఖ రూ.5 టికెట్‌తో దర్శనం కల్పించింది. ఓం శాంతి బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో పాతశ్రీకాకుళం సంతోషిమాత ఆలయ సమీపంలో ద్వాదశి జ్యోతిర్లింగాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాత్రి సామూహికంగా పదివేల దీపాలు వెలిగించి శివునికి దీపారాధన చేశారు. ఇక్కడి సాయి గిరిని విద్యుత్‌దీపాలతో అలంకరించడంతో కొత్తకాంతులు సంతరించుకుంది. నక్కవీధిలో ఉమాజఠలేశ్వరస్వామి దేవస్థానంలో వేదుల రఘుశంకరశాస్ర్తీ, అశ్వినీకుమార్‌ల ఆధ్వర్యంలో 24గంటల ఏకాహం భజన, రుద్రహోమం, కల్యాణం, లింగాభరణం, తిరువీధి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మంగళవారం అన్నదానం ఉంటుందని నిర్వహకులు తెలిపారు. న్యూకాలనీ, పాతశ్రీకాకుళం, పాలకొండరోడ్ తదితర ప్రాంతాల్లోని సత్యసాయి మందిరాల్లో శివరాత్రి వేడుకల్లో భాగంగా రుద్రయాగం, నారికేళ, విభూది అభిషేక పూజలు జరిగాయి.
గుజరాతీపేట రాజరాజేశ్వరి దేవీపీఠంలో పెంట రామచంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలోనూ, దూదివారి వీధి రాజరాజేశ్వరి పీఠంలో ప్రసాదరావు ఆధ్వర్యంలోనూ శివరాత్రి సందర్భంగా సామూహిక రుద్రాభిషేకాలు, కలశ సహస్త్ర ఘటాభిషేకం, బిల్వార్చన, రుద్రహోమం వంటి పూజలు నిర్వహించారు. బ్యాంకర్స్ కాలనీ శివబాలాజీ దేవాలయంలో అర్చకులు మారుతీ ప్రసాద్ నిర్వహణలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బలగ ఉత్తరేశ్వరాలయం, పాలకొండ్ రోడ్ రామలింగేశ్వరాలయం, పాత శ్రీకాకుళం కాశీవిశే్వశ్వరాలయం, పిఎన్ కాలనీ పంచాయతన దేవాలయంలోని మృత్యుంజయేశ్వర సన్నిధిలో శివరాత్రి పూజలు నిర్వహించారు.