సంజీవని

వంటనూనెల్లో హానికారక కొవ్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆహారం’ అనేది ఆధునిక కాలంలో ఓ లాభసాటి అంతర్జాతీయ వ్యాపారం. శరీరానికి అపకారం చేసే కొవ్వు, ఆమ్లాలు కొన్ని అంతర్జాతీయంగా ఎగుమతి ఆహార పదార్థాలలో కలిసినపుడు ఆ ఆహార పదార్థాల లేబుల్‌మీద వాటి గురించి రాయకుండా మోసగిస్తున్నారు.
అధిక ఉష్ణం ద్వారానో లేదా అధిక పీడనం ద్వారానో తీసిన వంట నూనెల్ని ‘కోల్డ్ ప్రాసెస్డ్’ అని ముద్ర వేసుకుని అమ్ముకోవచ్చని అమెరికా ప్రభుత్వం ఓ చట్టం చేసింది. ఆ చట్టం ముసుగులో ప్రమాదకర కొవ్వు ఆమ్లాలు వంట నూనెల ద్వారా ప్రజల ఆహారాల్లోకి నిర్భయంగా చేరిపోతున్నాయి.
అయితే, ఇటలీ ప్రభుత్వం ఆలివ్ నూనెను వేడి లేదా పీడనం ప్రక్రియద్వారా తీయడాన్ని నిషేధించింది.
నూనె డబ్బామీద మొత్తం కొవ్వు శాతం ఎంత ఉందో రాస్తుంటారు. కానీ, వాటిలో సాచురేటెడ్, పోలిసాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఎంతెంత ఉన్నాయో విడిగా చూపించాలి. ఈ మూడింటి మొత్తానికన్నా టోటల్ ఫాట్ ఎక్కువగా వున్నట్లయితే అందులో ప్రమాదకర కొవ్వు ఆమ్లం ఉన్నట్లే. కానీ, దానిని చూపించరు. మనం కొనే వంట నూనెలో ఏది ఎంత ఉందో తెలుసుకునే హక్కు మనకు ఉంది. కానీ, తెలియజెప్పే యంత్రాంగమే మనకి లేదు.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఈ నూనెని సైనికులకు సరఫరా చేయించి వారు గుడ్డివాళ్లుగా కానీ, పక్షవాత రోగులుగా కానీ చేశారని- ఇపుడు ఈ నూనెతోనే వంటనూనెల్ని తయారుచేసి అమ్ముతున్నారని పెద్ద అలజడి రేగింది.
ఎరూసిక్ యాసిడ్, గూకోసైనాలేట్స్ అని రెండు విష రసాయనాలు ఈ ‘రాప్‌సీడ్’ ఆయిల్‌లో ఉన్నాయనీ, ఇవి నరాల జబ్బుల్ని, లివర్ జబ్బుల్ని, చర్మవ్యాధుల్ని తెస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టే, ఈ నూనెని నిషేధించాలని ఓ వర్గం వాదిస్తోంది.
రాప్ అనే తెల్ల ఆవాల గింజల్లాంటి గింజలనుంచి తీసే నూనె. దీంట్లో ప్రొటీన్లు, కొవ్వు చాలా తక్కువగా వుంటాయి. స్వల్పం కాబట్టి ప్రమాదం లేదని వాదించేవారూ ఉన్నారు.
మనకి తెలియకుండానే విదేశాల్లో తయారయ్యే వేలాది రకాల ఆహారపదార్థాల్లో రాప్‌సీడ్ ఆయిల్ తప్పక కలుస్తోంది. ఇది కెనడియన్ ఆయిల్ కాబట్టి ‘కెనోలా’ అని పిలిచారు. ఇది జెనటిక్ ఇంజనీరింగ్ సాధించిన ఒక అద్భుతం. ఉష్ణ వికీర్ణ ప్రక్రియ ద్వారా రాప్ ఆయిల్ స్వరూపానే్న మార్చి కెనోలా ఆయిల్‌ను తయారుచేస్తున్నారు. కెనడియన్ ప్రభుత్వం ఈ ఆయిల్‌ని ‘జనరల్లీ రికగ్నైజ్‌డ్ యూజ్ సేల్’ అని గుర్తింపు ఇచ్చారు. దీని ఫలితంగా ఇపుడు ఒక పరిశ్రమ అవతరించింది అంటున్నారు అమెరికాకు చెందిన హోలిస్టిక్ హెల్త్ ఎన్‌సైక్లోపీడియాలో పనిచేసే ఓ నిపుణుడు. ‘రాప్ గింజల్ని కీటకాలు కూడా తినవు. ఈ గింజలనుండి వచ్చే వాయువు తగిలితే చర్మం బొబ్బలెక్కిపోవడమో, పొక్కిపోవడమో జరుగుతుంది. కానీ అమెరికన్ ఆహార నిపుణులు ఈ గింజలనుంచి తీసిన కెనోలా ఆయిల్‌కి గుర్తింపు ఇచ్చేముందు ఈ విషయాన్నింటినీ పరిశీలించలేదంటున్నారు ఆ నిపుణులు.
పశువుల మేతలో కూడా ఈ కెనోలా ఆయిల్‌ను బాగా వాడుతుంటారు. దాని ఫలితంగా పాలు, వెన్న, మజ్జిగల ద్వారా మనుషులు అనేక వ్యాధులకు గురవుతున్నారు. భారతదేశంలోని పాల ఉత్పత్తిదారులు విదేశాలనుంచి పాల పొడిని విస్తారంగా దిగుమతి చేసుకుని, నీళ్లలో కరిగించి ఆ పాలకు తమ బ్రాండ్లు వేసుకొని అమ్ముతున్నారట. తస్మాత్ జాగ్రత్త!

-డా.గోవింద్ ఆర్.వర్మ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పేస్ హాస్పిటల్స్, 8885095601