Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందుంది పెద్ద సినిమాల పండుగ. అందుకే సందు చూసుకుని చిన్న చితకా సినిమాలు, మీడియం సినిమాలు ఈవారం బాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టేశాయ. ఒక్క సినిమా వచ్చి హిట్ అయ్యిందీ అంటే దాని అదృష్టం ఏంటోగానీ ఆ తర్వాత వచ్చే చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నీరుగారిపోతున్న చిత్రం చిత్ర పరిశ్రమలో కొద్ది వారాలుగా కనిపిస్తోంది. ఈవారమూ అదే విషయం స్పష్టమైంది. నారా రోహిత్ సావిత్రి, రామ్‌గోపాల్‌వర్మ ఎటాక్ చిత్రాలతోపాటుగా అప్పుడలా ఇప్పుడిలా, నన్నువదిలి నీవుపోలేవులే, 7 టు 4, భరతన్న అందరివాడు, ఆమె ఎవరులాంటి చిత్రాలన్నీ ఈవారం తెలుగు తెరపై దాడి చేశాయి. కానీ ఏవీ విజయం పొందలేదు. ఎటాక్ చిత్రంలో ఏం చర్చించాడో తెలియదు కానీ గతంలో వచ్చిన వర్మ మార్కు చిత్రాల పోకడలు కనిపించి, సినిమా థియేటర్ వైపు పోవడానికి ప్రేక్షకులు జంకుతున్నారు. సావిత్రి చిత్రం ఒకింత వైవిధ్యమైన కథే అయనా, సరైన కథనం లేక చతికిలపడింది. మిగతా చిత్రాల గురించి చెప్పుకోవడం దండగే. గత వారం విడుదలైన ఊపిరి మంచి కలక్షన్లతో స్టడీగా సాగుతోంది.