బిజినెస్

పోరుబాటలో వర్తకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారుల ఇష్టానుసారం నిబంధనలు ౄ వ్యాపారాలపై ఆంక్షలు
కిలో కందిపప్పు విక్రయంచినా వే బిల్లు
నేడు రాజమహేంద్రవరంలో రాష్టస్థ్రాయి సదస్సు
ఒక రోజు బంద్ ౄ ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధికం

రాజమహేంద్రవరం, మార్చి 12: రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వర్తకులు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బంగారం వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ పన్నులకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మె చేస్తున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకో రకం నిబంధనలతో వ్యాపారం చేయటం సాధ్యంకాని పరిస్థితుల్లోకి తమను రాష్ట్ర ప్రభుత్వం నెడుతోందని, ఇక తాడోపేడో తేల్చుకోవటం మినహా మరో దారి లేదని ఆంధ్ర రాష్ట్ర వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగంపై ప్రజాప్రతినిధులకు పట్టు లేకపోవటంతో, అధికారులు తమకు నచ్చిన విధంగా నిబంధనలను రూపొందిస్తున్నారని, దీనివల్ల చిన్న వ్యాపారులే తీవ్రంగా నష్టపోతున్నారని వర్తక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వాణిజ్యశాఖ ద్వారా సమకూరుతున్న ఆదాయంలో 80 శాతం ఆదాయం కార్పొరేట్ కంపెనీల ద్వారానే లభిస్తుంది. చిన్న వ్యాపారుల నుండి సమకూరేది కేవలం 20 శాతం మాత్రమే. ఇలాంటి 20 శాతం ఆదాయాన్ని సమకూర్చిపెట్టే వారిలో రాష్ట్రం లో సుమారు 2 లక్షల మంది వ్యాపారులున్నారు. ఇలాంటి చిన్న వ్యాపారులు రాష్ట్రప్రభుత్వానికి చెల్లించేదాని కన్నా వేధింపులకు గురిచేస్తున్న అధికార యంత్రాంగానికి చెల్లిస్తున్నదే ఎక్కువ. ఉదాహరణకు కిరాణా వ్యాపారి ఫుడ్ అడల్టరీ(ఎఫ్‌ఎ) లైసెన్సుకు చెల్లించేది కేవలం రూ. 100. ఈ లైసెన్సు కోసం అవినీతి అధికారులకు రూ. 2వేలు చెల్లించకపోతే పని జరగదు. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జారీచేసిన విధానం ప్రకారం వినియోగదారులు కిలో కందిపప్పు కొని ఇంటికి తీసుకెళుతున్నా వర్తకుడు వే బిల్లు ఇవ్వాలి. లేదంటే కేసు, అపరాధంతో వేధింపులు తప్పవు. గోడ దాటితే బిల్లు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర వాణిజ్యశాఖ అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. మరో కొత్త నిబంధన ప్రకారం ఫ్యాన్సీ, కిరాణా, హార్డ్‌వేర్ తదితర వ్యాపారులు ఇక నుండి 5 రకాల షెడ్యూల్స్‌లోని ఉత్పత్తులను మాత్రమే అమ్మాలి. అంతకు మించి అమ్మితే కేసులు, జరిమానాలు భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫ్యాన్సీ, కిరాణా వ్యాపారులు జండూబామ్, అమృతాంజన్ నుండి, చీమల మందు, పప్పు ధాన్యాలు, సబ్బులు తదితర ఉత్పత్తులను అమ్ముతున్నారు. కొత్త విధానంలో అమృతాంజన్ ఫార్మాస్యూటికల్స్‌లోకి, పెట్రోలియం జెల్లీ పెట్రోలియం ఉత్పత్తుల్లోకి, చీమల మందు పురుగుమందుల్లోకి వెళుతుంది. 5 రకాలను మించి అమ్మకూడదన్న నిబంధనలో ఇలాంటి సరుకులను ఇక నుండి అమ్మటానికి వీలుండదు. అదనంగా ఉంటే కేసులు భరించాలి. బంగారంపై కేంద్ర ప్రభుత్వం ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్టు కనిపిస్తున్నా, దీనిని ఆసరాగా చేసుకుని ఎక్సైజ్ అధికారులు బంగారం దుకాణాలు, జ్యూయలరీ కార్మికులపై దాడులు చేసి వేధింపులకు గురిచేస్తారని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో జీడిపప్పు పరిశ్రమ కూడా మూతపడే ప్రమాదం కనిపిస్తోందని వర్తకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వర్తక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేసేందుకు వ్యాపార వర్గాలు సిద్ధమవుతున్నాయ. ఆదివారం రాజమహేంద్రవరంలో జరగనున్న రాష్ట్ర సదస్సుకు అన్ని జిల్లాల నుండి వర్తకులు హాజరుకానున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఒక రోజు బంద్, అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక బంద్‌కు సిద్ధంకావాలని వర్తకులు భావిస్తున్నారు. టర్నోవర్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, వస్త్రాలపై వ్యాట్ తదితర ఉద్యమాలు రాజమహేంద్రవరం నుండే ప్రారంభమై విజయవంతమైయ్యాయ. దీంతో సెంటిమెంట్‌తో ఈ ఉద్యమాన్ని కూడా రాజమహేంద్రవరం నుండే వ్యాపారులు ప్రారంభించనున్నారు