రాష్ట్రీయం

పాతబస్తీలో ముస్లింల భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘనంగా మిలాద్ ఉన్ నబీ భారీ భద్రత.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, డిసెంబర్ 24: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా పాత బస్తీలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం మిలాద్-ఉన్-నబీ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. చార్మినార్ నుంచి ప్రారంభమైన ర్యాలీని కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించగా కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్, మాజీ మంత్ర జానారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ముస్లింల ర్యాలీ సందర్భంగా నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చార్మినార్, జియాగూడ, అఫ్జల్ గంజ్, చాదర్‌ఘాట్, పురానీ హవేలి, మదీనా, షయనాజ్‌గంజ్, ఛత్రినాక మార్గాల్లో వెళ్లే పలు ఆర్టీసి బస్సులను రద్దు చేశారు. మరికొన్ని బస్సుల దారి మళ్లించి చంపాపేట్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ మీదుగా చార్మినార్ వైపు వెళ్లేందుకు వీలు కల్పించారు. అంబర్‌పేట, మలక్‌పేటలలో కూడా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పాషాఖాద్రితోపాటు పలువురు ఎంఐఎం నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలో రెండుగంటల పాటు సాగిన ర్యాలీలో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. మూడువేల మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ తెలిపారు.