హైదరాబాద్

బుద్దుడు-పూలే-అంబేద్కర్-తాత్వికత రాష్టస్థ్రాయి శిక్షణా తరగతులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్‌టిఆర్ ఆడిటోరియంలో బుద్దుడు, పూలే, అంబేద్కర్, తాత్వికత రాష్టస్థ్రాయి శిక్షణ తరగతులు ప్రారంభమైనాయి. ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ప్రత్యేక అధికారి ఆర్.సుబ్బారావు మాట్లాడురతూ చరిత్ర కాలంనుండి మత కుల వర్గాల స్థితిగతులను వివరించారు. భారతదేశంలో బౌద్ధ సాంస్కృతిక పునర్జీవనం అంశంపై పూజ్యబంతే ధమ్మదజ భిక్షవు ప్రసంగించారు. అంబేద్కర్ సామాజిక దృక్పథం గురించి డా.ఎంఎస్ గోపీనాథ్ ఉపన్యసించగా మహాత్మా పూలే రచనల్లో గులాంగిరి ప్రాధాన్యత అనే అంశంపై రచయిత వి.జి.ఆర్. నారగోని ప్రసంగించారు. భారతదేశంలో కులం పుట్టుక, వ్యాప్తి, నిర్మూలన అంశంపై రచయిత జి.కళ్యాణరావు ప్రసంగించారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు బోగె రాజారావు అధ్యక్షత వహించగా కార్యదర్శి సిహెచ్ అయిలయ్య స్వాగతం పలికారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్తులు కావాలి
కెపిహెచ్‌బికాలనీ, మార్చి 13: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్తులు కావాలని ప్రభుత్వ సలహాదారుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదర్‌నగర్ డివిజన్ శ్రీనివాసనగర్‌కాలనీలోని ది నెస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన తెరాస అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దినెస్ట్ అసోసియేషన్ అద్యక్షుడు రమేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన సభకు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో పాటు హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ జానకి రామరాజు, కుత్బుల్లాపూర్ టిఆర్‌ఎస్ నాయకులు కొలను శ్రీనివాస్‌రెడ్డి, విశాల్‌గౌడ్ పాల్గొన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దినెస్ట్ అపార్ట్‌మెంట్ చేస్తున్న స్వచ్చంద కార్యక్రమాలను అభినందించారు. పేద కుటుంబానికి చెందిన జిల్లెల కృష్ణ కుమార్తె రూపశ్రీ కాలేయ మార్పుడికి ప్రభుత్వం తరపున రూ.15 లక్షల సహాయం చేయడం, మిగతా రూ.15 లక్షలను ది నెస్ట్ అపార్ట్‌మెంట్ సేకరించడం అభినందనీయమని చెప్పారు. కొలను శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న నిజాంపేట్ రోడ్డు కాలనీ వాసుల పట్టుదలతో రోడ్డు వేయించుకోవడాన్ని అభినందించారు. నిజాంపేట ప్రజలు రంగారెడ్డి ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హైదర్‌నగర్ కార్పొరేటర్ జానకి రామరాజుకు ప్రత్యేక దన్యవాదాలు తెలియచేశారు. కాలనీ వాసులు అంభీర్ చెరువును మిషన్‌కాకతీయ ద్వారా శుద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందచేశారు. దినెస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేకరించిన రూ.3.50 లక్షల చెక్కును సిసిటివి ఏర్పాట్లకు జానకి రామరాజుకు అందచేశారు. దామోదర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రవికుమార్, అశోక్, బాలాజీ, సునీల్, రవికిరణ్, బ్రహ్మయ్య, శ్రీనివాస్ , నవీన్, రమేష్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

రాధశ్రీకి రాయప్రోలు సాహితీ పురస్కారం
కాచిగూడ, మార్చి 13: ఆచార్య రాయప్రోలు సుబ్బరావు 125వ జయంతి సందర్భంగా ప్రముఖ కవి డా.రాధశ్రీకి రాయప్రోలు సాహితీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి గానసభలోని కళాలలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త డా.ద్వానాశాస్ర్తీ రాధశ్రీకు రాయప్రోలు సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాయప్రోలు భావకవితా పితామహుడుగా పేరు గావించారని పేర్కొన్నారు. పద్యం ఎంతో గొప్పదని, పద్యం కేవలం తెలుగువారి సొంతం అని తెలిపారు. రాయప్రోలు సాహితీ పురస్కారం రాధశ్రీకు ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డా.వంశీరామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రపంచ రికార్డుల గ్రహీత డా.కళావేంకట దీక్షితులు, ఫిలిం సెన్సార్‌బోర్డు సభ్యురాలు డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.