రాష్ట్రీయం

అంధకారంలో భద్రాచలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రూ.60 లక్షల విద్యుత్ బకాయిలు
* సరఫరా నిలిపివేసిన ట్రాన్స్‌కో
భద్రాచలం , డిసెంబర్ 29: ఖమ్మం జిల్లా భద్రాద్రి అంధకారంలో చిక్కుకుంది. గ్రామపంచాయితీ అధికారులు ట్రాన్స్‌కోకు బకాయి పడటంతో పట్టణంలోని వీధి దీపాల కాంతులు ఆగిపోయాయి. రూ.60 లక్షల మేర ట్రాన్స్‌కో గ్రామ పంచాయితీ బకాయి పడింది. పలుమార్లు బిల్లులు చెల్లించాలని కోరినా గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మంగళవారం నుంచి గ్రామ పంచాయతీకి చెందిన విద్యుత్‌ను నిలిపివేశారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులు, కాలనీలు అంధకారంమయంగా మారాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తుండటం, నూతన సంవత్సరం రోజు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో కారుచీకట్లో భద్రాద్రి ఉండటం విశేషం.