జాతీయ వార్తలు

ట్రిబ్యునల్ ఏర్పాటు ఇంకా ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జలాల వివాదంపై
సుప్రీంకోర్టు ఆగ్రహం
పూర్తి వివరాలతో రండి
ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశం

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆంధ్ర- తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ సాచివేత ధోరణిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ ఈ కేసును ట్రిబ్యునల్‌కు నివేదించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దీనిపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ పంత్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ట్రిబ్యునల్ రూపురేఖలు ఏమిటి? విధానాలను ఖరారు చేశారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది సంతృప్తికరమైన జవాబులు ఇవ్వకపోవటంతో బెంచ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై విచారణ జరుగుతుందని తెలిసినా ప్రభుత్వ వైఖరిపై పూర్తి వివరాలతో హాజరు కాకపోవటం సమంజసంగా లేదని బెంచ్ ప్రభుత్వ న్యాయవాదిని తప్పుపట్టింది. వాదోపవాదాలు కొంతసేపువాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వ వైఖరిపై పదిహేను నిమిషాలలో నివేదిక ఇవ్వండని బెంచ్ ఆదేశించింది. బెంచ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వంతో సంప్రదించి తిరిగి కోర్టుకు వచ్చారు. ఈ వివాదాన్ని ట్రిబ్యునల్‌కు నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, విధి విధానాలతోసహా అన్ని వివరాలనూ మంగళవారం న్యాయస్థానానికి నివేదిస్తామని న్యాయవాది తెలియచేయటంతోవిచారణ మంగళవారానికి వాయిదా వేశారు.