అక్షర

ప్రశంసా ‘పాత్ర’ ఆవిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘త్రిజట’ పద్య కావ్యం
ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పుటలు: 88
వెల: రూ.75;
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా,
కాచిగూడ చౌరస్తా,
హైదరాబాద్

రామాయణం రమణీయం, ‘రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకమ్’ అన్నాడు భోజకాళిదాసు. అంటే విద్యావంతులైన వివిధ వర్గాలవారికీ పఠనీయమైన పుస్తకం అని ఆ మహాకవి భావం. రామాయణంలోని విశేషమేమంటే అందులోని చాలా పాత్రలు పాఠకులను ఆలోచనా లోకాల్లోకి లాక్కుపోతాయి. ఒక జిజ్ఞాసను కలిగిస్తాయి. శబరి, జటాయువు, సంపాతి, అహల్య, గుహుడు మొదలైన చాలా పాత్రల సంభాషణలు, వృత్తాంతాలు, పరిమాణపరంగా కొద్దిపాటివే అయినా అవి మన మనస్సులో చెరగని ముద్రవేస్తాయి. అలాంటి వాటిలో త్రిజట అనే ఒక ముసలి రక్కసి ఒకటి.
లంకలో అశోకవనంలో రావణాజ్ఞమేరకు కొందరు రాక్షస స్ర్తిలు సీతమ్మతల్లిని చిత్రహింస చేయబూనుతారు. ఆ సందర్భపు గోలకు నిద్రనుంచి మేల్కొన్న త్రిజట అనే వృద్ధరాక్షసి ‘తాను అంతకుముందు కొన్ని నిముషాల కిందటే ఒక కలగన్నాను. శ్రీరాముడు వచ్చి సీతమ్మ తల్లిని పుష్పక విమానంలో తీసుకుపోతాడు, రావణుడు, అతని సుతులు హీనాతిహీనమైన మరణాన్ని పొందుతారు. ఒక కోతి వచ్చి లంకను తగలబెట్టేస్తుంది. లంకానగరం సముద్రంలో మునిగిపోతుంది. మీరు సీతనేమీ హింసపెట్టకండి’ అని చెపుతుంది అక్కడి సహచర రాక్షసస్ర్తిలకు. ఈ నాలుగు మాటలు చిన్న వృత్తాంతంలోని త్రిజటను-విశ్వనాధ వారి ‘జీవుని వేదన’ అనే ఒక భావాత్మక సాంకేతిక పదానికి ఒక కోణపు, ఒక పార్శ్వపు రూపంగా-ఆచార్య అనుమాండ్ల భూమయ్య ‘త్రిజట’ అనే తన కావ్యంలో ఎంతో సమర్ధవంతంగా ఆవిష్కరించారు.
త్రిజటయొక్క ఆత్మజ్ఞాన సిద్ధిని, దివ్యానుభూతిని సరళ సుందర భాషలో, అలతి అలతి వాక్యాలతో దాదాపు ఒక నూట ముప్ఫై తేట తెలుగు గీతులు, రెండు ద్విపదలలో కొన్ని కవిత్వపు మెళకువలతో ఏమాత్రమూ అన్వయ క్లిష్టత లేకుండా వర్ణించారు. కొన్నిచోట్ల భావగాంభీర్యము, ధ్వని సౌందర్యము చాలా బాగున్నాయి.
కలలో సీతను గాంచిన త్రిజట ‘చిరతప్ఫఃలమ్ముగా సీతవచ్చె శ్రీలలిత వోలె’ అనుకుందిట. ‘్భవనాగమ్య’, ‘్ధ్యనగమ్య’ ఇత్యాదులు లలితా సహస్రనామాలలోనివి. త్రిమాతృ స్వరూపిణియైన లలితాదేవి లాగ మహాలక్ష్మీ ఇహలోక రూపమైన సీతమ్మవారు కనిపించింది నాకు అని అనడంలోని అద్వైత భావం ఇందులోని గంభీర భావం.
దశరధుడు పుత్రకామేష్టి అనే మహాయజ్ఞాన్ని చేస్తే కానీ పుట్టని రాముడు ఏదీ చేయని నాకు కనిపించాడు కలలో అనుకున్నది త్రిజట అనడంలో రామదర్శనం ఎంతటి అదృష్టైక ఫలమో బహు ధ్వని గర్భితంగా చెప్పారు భూమయ్యగారు.
‘‘నన్ను నిజముగా నడిపించుచున్నదేదో/మరపుపొరలలో పడిపోక మసులుచుంటి/మట్టి ముద్దగా, శవముగా యిట్టినన్ను/రాక్షసుండేలుచుండె తా రాజునంచు’ అనుకున్న త్రిజట మాటలలో ఆధునిక వికృత ధోరణుల కాలంలో జిజ్ఞాసులైన వానియొక్క జీవుని వేదనను పరోక్షంగా చిత్రించారు కవి.
‘‘ఆడ మగయను భేదమింతైన లేదు;/ఒక్కటే త్రాగు, టాడుట, ఒక్కతీరు/కాని ఏవొపాట; లసహ్యకరమె అంత;/లక్ష్య గతిలేని లయలేని లంక గంటి’’ అంటూ నేటి కాలపు నైట్ క్లబ్బులు, పబ్బులు, బాల్‌రూమ్ డాన్సుల వెర్రి తలల కుసంస్కృతిని ఎండగట్టారు లంకమీద పెట్టి ఒక ఉదాత్త విద్యా సంస్కృతి ఆచార్యవర్యులుగా.
‘‘సూర్యవంశీయుడైన రాముడిని చూడడానికి సూర్యుడే తనకుతానుగా వచ్చాడు. అలా వచ్చి‘రాముడు’ అనే చిరంతన సత్సస్వరూపాన్ని నాకు బంగారు తెర ఎత్తి చూపించాడు నామీద కనికరంతో’’ అనుకున్నది త్రిజట అనడంలోని భావ సౌందర్యం విలక్షణం.
‘‘కలలో తెల్లని వస్త్రాలు ధరించి మందహాసం చేస్తున్న రామచంద్రుడిని చూసేసరికి నవరత్నాలలో ఒకటైన నీలం నవ్విందేమో ఉత్సాహభరితంగా’’ అనడంలోని ఉత్ప్రేక్ష, ‘‘కలలో సీతారాములు కలవడం చూసాను. కాంతి కిరణాలు సూర్యుని కలిసినట్టు/ఇనుకులేశ్వరు గలియగ నిపుడు గంటి’
అనడంలోని శే్లష, ధ్వన్యాకర్షణ-ఇలాంటి కొన్ని కమ్మని కవిత్వపు విలువలు మెరుస్తూ కనిపిస్తాయి ఈ పుస్తకంలో చాలా చోట్ల.
అసంఖ్యాక సముచిత ఉపమానాలు, చక్కటి ఊహాభావ చిత్రాలు, నిండైన భావ సౌందర్యాలు, ‘కన్నీటి ఎడద పరమళించడం’(79వ పద్యంలో) మొదలైన భావ లాలిత్యాలు, రావణుని కొంత దూరం మోసి ‘‘ఛ! ఇందాకటినుంచి ఇంత సిగ్గుమాలిన పని చేసానే’’ అనుకుంటు అది రావణుడిని కిందపడేసింది; సిగ్గుపడ్డది’ అనడం మొదలైన హాస్యోక్తులు-ఇలాంటి చాలా విశేషాలు కావ్యగౌరవాన్ని తెచ్చిపెట్టాయి ఈ ‘త్రిజట’కు.
‘ఉన్నపళముగా’, మన్నీడు (భమి కలవాడు-భపతి, మన్యమునకు అధిపతి మొదలైన అర్ధాలలో), నవ్వు కానట్టి నవ్వు (చిన్నబోవడం), గొండిలి(నృత్యం) మొదలైన తెలుగు పదాల జిలుగే కాకుండా తె లుగువారి కాకువులు, నుడికారాలు కూడా అక్కడక్కడా అందగించాయి.
58వ పద్యంలో ‘మదగజమది యేమి? ఈ మంద గమనమేమి? నాకు నడక నేర్పుతుందా?’ అని సీత నవ్వింది అని వ్రాసారు అనుమాండ్లవారు.సీతకు సుంతైనా అహంకారముంటుందా? ఇది చర్చనీయాంశమే. కానీ ఏనుగు చేష్టలకు సీత ముచ్చటపడి నవ్వుకుంది అనే భావం పాఠకుడు తీసుకోగలిగితే పరవాలేదు.
‘‘ఏదో కాంతి వచ్చి నా ఎల్ల తనువునందలి అణువణువన చేరి అమృతమయ్యె’’ అనే 68వ పద్యంలోని భావానే్న 72వ పద్యంలోను, ఇంకొక చోట గూడాను కొంచెం మార్చి మార్చి రాసినట్టే కనిపిస్తుంది.
73వ పద్యంలో ‘‘పొంది నానన్పించినదిప్పు్డ; పూర్వ జన్మ’‘ అనే 3వ పాదంలో గణభంగం దొర్లింది. ‘పొందినానన్పించినదిప్పు్డ; పూర్వ జన్మ’ అనే 3వ పాదంలో గణభంగం దొర్లింది. ‘పొందితన్పించినదియిప్పు్డ; పూర్వ జన్మ’అనో, మరోలాగానే కూర్చి ఉంటే గణభంగం జరిగేది కాదు. 83వ పద్యంలో ‘పూసుకొనగగంటి’ అని ఉండాల్సిన చోట అచ్చుతప్పుగా ‘గ’లోపించడంవల్ల గణ భంగం కనిపిస్తుంది.
కొన్నిచోట్ల ఉత్వ నిత్సత్వ సంధి పాటించలేదు. ఈ లోపం ఒక ‘దిష్టి చుక్క’గా ఉన్నది.
మొత్తంమీద ఈ త్రిజట కావ్యంలో పాత్రతత్త్వ ఆవిష్కరణ ఉదాత్త సుందర ఊహాత్మకంగా క్రమ కవితాకృతిలో జరిగింది.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం